12 లక్షలు లంచం డిమాండ్.. ఏసీబీకి అడ్డంగా దొరికిన ఇబ్రహీంపట్నం ఆర్ఐ

12 లక్షలు లంచం డిమాండ్.. ఏసీబీకి అడ్డంగా దొరికిన ఇబ్రహీంపట్నం ఆర్ఐ

రాష్ట్రవ్యాప్తంగా అవినీతి అధికారులపై యాంటి కరప్షన్ బ్యూరో (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది. ప్రజల అవసరాలను ఆసరా చేసుకుని ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటున్నట్లు సమాచారం వస్తే వెంటనే అక్కడి వాలిపోయి.. అవినీతి అధికారుల భరతం పడుతోంది ఏసీబీ. ఈ క్రమంలోనే 2025 మే29న లంచం తీసుకుంటుండగా  రంగారెడ్డి జిల్లా ఇబ్రంహీంపట్నం మండలం ఆర్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ఏసీబీ.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయ పరిధిలో  అధిబట్ల రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబర్. 355లో 0.07 గుంటల భూమి పీవోబీలో ఉండడంతో బాధితులు గత 3 నెలలుగా తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. అయితే  ఆర్డీవో, ఎమ్మార్వో, డీటీకి  ఇవ్వాలని 12 లక్షలు లంచం డిమాండ్ చేశాడు రెవెన్యూ ఇన్స్ పెక్టర్( ఆర్ఐ) కృష్ణ.  బాధితుడితో 9 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

►ALSO READ | భర్తను ఉరేసి చంపి..కిందపడి చనిపోయాడని అందర్నినమ్మించింది

 గతంలో 3 లక్షలు ఇచ్చాడు. మిగతావి ఇవ్వడం ఇష్టం లేక  బాధితులతో ఒకరైన ఇమ్మిడి బాలకృష్ణ ఏసీబీని ఆశ్రయించారు. పక్కా ప్లాన్ తో ఏసీబీ అధికారులు  మే 29న తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆర్ఐ కృష్ణను పట్టుకొని అతని వద్ద ఉన్న ఫైల్స్ ను తనిఖీ చేశారు.  ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆనంతరెడ్డి, ఎమ్మార్వో సునీత, డీటీ శ్రీనివాస్, ఆర్ఐ కృష్ణలను దాదాపు 3 గంటలుగా విచారించారు.