హైదరాబాద్, వెలుగు: పన్ను సంస్కరణలపై అవగాహన కల్పించేందుకు ఐసీఎంఏఐ ఆదాయపు పన్ను శాఖ సహకారంతో 'ఆదాయపు పన్ను చట్టం 2025'పై హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించింది.
ఆదాయ పన్ను సంస్కరణలపై వృత్తి నిపుణులు అవగాహన కలిగి ఉండాలని ముఖ్య అతిథి ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ షానవాజ్ ఉల్ రెహమాన్ ఈ సందర్భంగా అన్నారు.
మారుతున్న పన్ను విధానాలను అర్థం చేసుకోవడం ఎంతో కీలకమన్నారు. ఇన్వెంటరీ వాల్యుయేషన్, కొత్త పన్ను విధానంలోని మార్పులపై ఈ సందర్భంగా చర్చ జరిగింది.
