ICC Cricket Schedule: రేపు అసలు మిస్ అవ్వకండి.. ఒక్క రోజే ఐదు ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు

ICC Cricket Schedule: రేపు అసలు మిస్ అవ్వకండి.. ఒక్క రోజే ఐదు ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు

ఒకే రోజు ఐదు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జరగడం చాలా అరుదు. అయితే క్రికెట్ లవర్స్ కు గురువారం (అక్టోబర్ 23) ఐదు అంతర్జాతీయ మ్యాచ్ లు చూసే అవకాశం కలగనుంది. ఈ వారంలో శ్రీలంక తప్పితే అన్ని దేశాలు క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు మహిళల వరల్డ్ కప్ కూడా జరుగుతుంది. ఐదు ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఏంటో వాటి టైమింగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. 

ఇండియా, ఆస్ట్రేలియా రెండో వన్డే:

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య  గురువారం (అక్టోబర్ 23) రెండో వన్డే ప్రారంభం కానుంది. తొలి వన్డేలో ఓడిపోయిన టీమిండియా ఈ మ్యాచ్ లో ప్రతీకారం తీర్చుకొని సిరీస్ ను 1-1 తో సమం చేయాలని భావిస్తోంది. ఇప్పటికే తొలి వన్డేలో గెలిచిన ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో నిలిచింది. అడిలైడ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఉదయం 9:00 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ 8:30 గంటలకు వేస్తారు. 

పాకిస్థాన్, సౌతాఫ్రికా రెండో టెస్ట్:

రావల్పిండి వేదికగా పాకిస్థాన్, సౌతాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్ట్ సోమవారం (అక్టోబర్ 20) ప్రారంభమైంది. ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆట గురువారం (అక్టోబర్ 23) జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 333 పరుగులు చేసింది. మరోవైపు తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 404 పరుగులు చేసి 71 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. రేపు జరగనున్న నాలుగో రోజు ఆటలో ఫలితం వచ్చే అవకాశం ఉంది. రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఇప్పటికే సౌతాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ ఉదయం 10:00 గంటలకు ప్రారంభమవుతుంది.   

ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మూడో టీ20:

మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య  గురువారం (అక్టోబర్ 23) మూడో టీ20 ఆడనున్నాయి.    ఆక్లాండ్ వేదికగా ఈడెన్ పార్క్ లో ఈ మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. రెండో వన్డేలో ఇంగ్లాండ్ గెలిచి మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. చివరి టీ20 లో ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ గెలుచుకుంటుంది. ఒకవేళ న్యూజిలాండ్ గెలిస్తే సిరీస్ సమమవుతుంది. మ్యాచ్ ఉదయం 11:45 గంటలకు ప్రారంభమవుతుంది. 

న్యూజిలాండ్ మహిళలతో ఇండియా ఢీ

మహిళల వరల్డ్ కప్ లో భాగంగా గురువారం (అక్టోబర్ 23)న్యూజిలాండ్ పై ఇండియా కీలక మ్యాచ్ ఆడనుంది. ఒకరకంగా టీమిండియాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్ లో ఓడిపోతే సెమీస్ అవకాశాలు క్లిష్టం అవుతాయి. వరుసగా మూడు విజయాలతో ఢీలా పడిన భారత మహిళల జట్టు రేపు కివీస్ మహిళలపై ఎలా ఆడుతుందో ఆసక్తికరంగా మారింది. మ్యాచ్ మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమవుతుంది.  

వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడో వన్డే:

మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడో వన్డే గురువారం (అక్టోబర్ 23) ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు వన్డేలు జరిగితే ఇరు జట్లు చెరో వన్డేలు గెలిచాయి. రెండప్ జరగనున్న చివరి మ్యాచ్ లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. 


ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే జట్ల మధ్య ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఈ రోజు ముగియకపోతే ఫలితం కోసం గురువారం (అక్టోబర్ 23) కోసం ఆగాలి. అప్పుడు ఆరు అంతర్జాతీయ మ్యాచ్ లు ఫ్యాన్స్ చూసే అవకాశం ఉంది.