ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి10న తొలి మ్యాచ్ జరగనుంది.  న్యూలాండ్స్‌లో జరిగే ఫస్ట్ మ్యాచ్లో  సౌతాఫ్రికాను  శ్రీలంక ఢీకొట్టనుంది.  ఫిబ్రవరి 21 వరకు గ్రూప్ మ్యాచ్ లు జరుగుతాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 23 ఫిబ్రవరి నుంచి నాకౌట్ మ్యాచులను నిర్వహిస్తారు. 23న ఫస్ట్ సెమీస్ జరగనుండగా.. ఏవైనా కారణాలతో నిలిచిపోతే..తర్వాత రోజు రిజర్వ్ డే ఉంటుంది. ఆ తర్వాత  ఫిబ్రవరి 24 రెండో సెమీస్ జరగనుంది. తర్వాతి రోజు రిజర్వ్ డేగా నిర్ణయించారు. ఫిబ్రవరి 26న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నాకౌట్ మ్యాచులకు కేప్ టౌన్ వేదికగా కానుంది. 

పాక్తో భారత్ తొలి మ్యాచ్..
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ను టీమిడియా ఫిబ్రవరి 12న ఆరంభించనుంది. మొదటి మ్యా్చ్లో భారత మహిళల జట్టు చిరకాల ప్రత్యర్థి పాక్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు కేప్ టౌన్ వేదిక కానుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 15న విండీస్తో రెండో మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 18న ఇంగ్లాండ్తో మూడో మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 20న ఐర్లాండ్తో గ్రూప్ స్టేజ్లో భారత మహిళల జట్టు చివరి మ్యాచ్లో పాల్గొననుంది.

ప్రత్యేక అతిథిగా మిథాలీ రాజ్
ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్లో మొత్తం 10 జట్లు పాల్గొనబోతున్నాయి. గ్రూప్ 1లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ ఉండగా..గ్రూప్ 2లో ఇంగ్లాండ్, ఇండియా, వెస్టిండీస్, పాకిస్తాన్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. ఈ మెగా టోర్నీ 15 రోజుల పాటు జరగనుంది. ఈ టోర్నీకి కేప్ టౌన్, పార్ల్, జెబెర్హా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. త్వరలో ఉమెన్స్ టీ20 మ్యాచ్ ల టికెట్ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.  టిక్కెట్ల ధరలు 60 ర్యాండ్లు భారత కరెన్సీలో  రూ. 275 నుంచి ప్రారంభమవుతాయి. ఐసీసీ అంబాసిడర్ మిథాలీ రాజ్ ఉమెన్స్ టీ20 ఫైనల్  ప్రత్యేక అతిథిగా రానుంది.