16 జట్లు.. 41 మ్యాచ్‌లు.. యువ ఆటగాళ్ల వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే

16 జట్లు.. 41 మ్యాచ్‌లు.. యువ ఆటగాళ్ల వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే

భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ ముగిసిన నెల రోజుల్లోనే మ‌రో ప్ర‌పంచ క‌ప్ మొద‌లవ్వ‌నుంది. అవును.. అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి(ఐసీసీ) శుక్రవారం అండ‌ర్ -19 పురుషుల‌ వ‌ర‌ల్డ్ క‌ప్ 2024షెడ్యూల్ విడుద‌ల చేసింది. 

యువ ఆటగాళ్లు తలపడే ఈ మెగా సమరణానికి శ్రీ‌లంక ఆతిథ్యం ఇవ్వనున్న‌ట్లు ఐసీసీ వెల్ల‌డించింది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 13న ప్రారంభమయ్యే ఈ టోర్నీ 23 రోజుల పాటు అభిమానులను ఎంటర్టైన్ చేయనుంది. ఈ టోర్నీలో భారత యువ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. 

16 జట్లు... 4 గ్రూప్‌లు

మొత్తం 16 జ‌ట్లు టైటిల్ కోసం పోటీ ప‌డ‌నున్నాయి. వీటిని నాలుగు గ్రూప్‌లుగా విభ‌జించారు. ఇండియా, బంగ్లాదేశ్, ఐర్లాండ్, అమెరికా జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బి (ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్).. గ్రూప్-సి (ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, నమీబియా).. గ్రూప్-డి (ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, న్యూజిలాండ్, నేపాల్)లో ఉన్నాయి.

ఫైన‌ల్‌తో క‌లిపి 41మ్యాచ్‌లు నిర్వ‌హిస్తారు. గ్రూప్ దశలో ప్రతి గ్రూప్ నుండి మొదటి మూడు జట్లు చొప్పున 12 జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి. ఈ 12 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఈ రెండు గ్రూప్‌ల నుండి మొదటి రెండు జట్లు సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం నాకౌట్ మ్యాచ్ లు మొదలవుతాయి. ఈ టోర్నీలో భార‌త జ‌ట్టు జ‌న‌వ‌రి 14న రన్నరప్ బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడ‌నుంది.

 • గ్రూప్-ఏ: ఇండియా, బంగ్లాదేశ్, ఐర్లాండ్, అమెరికా 
 • గ్రూప్-బి: ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్
 • గ్రూప్-సి: ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, నమీబియా
 • గ్రూప్-డి: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, న్యూజిలాండ్, నేపాల్

షెడ్యూల్‌

 • జనవరి 13: శ్రీలంక vs జింబాబ్వే, న్యూజిలాండ్ vs నేపాల్, ఇంగ్లాండ్ vs స్కాట్లాండ్
 • జనవరి 14: బంగ్లాదేశ్ vs ఇండియా, ఆస్ట్రేలియా vs నమీబియా, సౌతాఫ్రికా vs వెస్టిండీస్
 • జనవరి 15: పాకిస్థాన్ vs ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ vs USA
 • జనవరి 16: దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్, శ్రీలంక vs దక్షిణాఫ్రికా
 • జనవరి 17: నేపాల్ vs పాకిస్థాన్, వెస్టిండీస్ vs స్కాట్లాండ్, నమీబియా vs జింబాబ్వే
 • జనవరి 18: భారత్ vs USA, ఆఫ్ఘనిస్తాన్ vs న్యూజిలాండ్, బంగ్లాదేశ్ vs ఐర్లాండ్
 • జనవరి 19: జింబాబ్వే vs ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ vs వెస్టిండీస్
 • జనవరి 20: ఇండియా vs ఐర్లాండ్, స్కాట్లాండ్ vs సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ vs నేపాల్
 • జనవరి 21: పాకిస్థాన్ vs న్యూజిలాండ్, శ్రీలంక vs నమీబియా, అమెరికా vs బంగ్లాదేశ్
 • జనవరి 23: A4 vs D4, B4 vs C4
 • జనవరి 24: A1 vs D2, C2 vs B3, C1 vs B2
 • జనవరి 25: D3 vs A2, C3 vs B1, D1 vs A3
 • జనవరి 26: B3 vs C1
 • జనవరి 27: A1 vs D3, D2 vs A3, B1 vs C2
 • జనవరి 28: B2 vs C3, D1 vs A2
 • జనవరి 30: సెమీ-ఫైనల్ 1 (AD1 vs BC2)
 • ఫిబ్రవరి 1: సెమీ-ఫైనల్ 2 (BC1 vs AD2)
 • ఫిబ్రవరి 4: ఫైనల్