World Cup 2023: ప్రైజ్ మనీ వివరాలు వెల్లడించిన ఐసీసీ.. విజేతకు ఎన్ని కోట్లంటే..?

World Cup 2023: ప్రైజ్ మనీ వివరాలు వెల్లడించిన ఐసీసీ.. విజేతకు ఎన్ని కోట్లంటే..?

భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ టోర్నీలో పాల్గొనే అన్ని దేశాలు.. తమ జ‌ట్లను కూడా ప్ర‌క‌టించాయి. ఈ నేపథ్యంలో అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి(ఐసీసీ) విజేత‌ల‌కు ఇచ్చే ప్రైజ్ మ‌నీ వివరాలు వెల్లడించింది. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ 10 ల‌క్ష‌ల డాల‌ర్లు(భారత కరెన్సీలో దాదాపు 83 కోట్లు)గా ప్రకటించింది. 

విజేత‌కు రూ. 33 కోట్లు

ఈ మెగా టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు 4 ల‌క్ష‌ల డాల‌ర్లు అందించనున్నారు. అంటే భారత కరెన్సీలో రూ. 33 కోట్లు ముట్టనుంది. ర‌న్న‌ర‌ప్ జ‌ట్టుకు 2 ల‌క్ష‌ల డాల‌ర్లు అంటే రూ. 16.5 కోట్లు దక్కనుంది. ఇక సెమీఫైన‌ల్ లో ఓడిన రెండు జట్లకు చెరో రూ. 13 కోట్లు అందనున్నాయి. 

ఇక సూప‌ర్ 6 ద‌శ‌లో ఇంటిదారి ప‌ట్టిన జ‌ట్ల‌కు రూ.4.9 కోట్లు ఇవ్వ‌నుండగా.. గ్రూప్ ద‌శ‌లో గెలిచిన జ‌ట్ల‌కు ప్రైజ్ మ‌నీ ఇవ్వ‌నున్నారు. గ్రూప్ స్టేజ్‌లో గెలిచిన ఒక్కో మ్యాచ్‌కు రూ.33 ల‌క్ష‌లు ల‌భిస్తాయని ఐసీసీ వెల్ల‌డించింది.

రౌండ్ రాబిన్ ఫార్మాట్ 

2019 వరల్డ్ కప్ వలే 2023 టోర్నీని రౌండ్ రాబిన్ ఫార్మాట్‍లోనిర్వహిస్తున్నారు. మొత్తం 10 జట్లు ఒకే గ్రూపులో ఉంచబడి... అన్ని జట్లు ఒకదానితో ఒకటి ఆడతాయి. ఇలా గ్రూప్ దశ ముగిసే సమయానికి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న 4 జట్లు సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్ లు మొదలవుతాయి.