న్యూఢిల్లీ: హైదరాబాద్ యంగ్ క్రికెటర్ ఆరోన్ జార్జ్ ప్రతిష్టాత్మక ఐసీసీ అండర్–19 వరల్డ్ కప్‌కు ఎంపికయ్యాడు. ఈ మెగా టోర్నీతో పాటు సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లే టీమిండియా జట్లను బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఆరోన్ రెండు జట్లలో చోటు సంపాదించాడు. సౌతాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీని, వైస్ కెప్టెన్‌గా జార్జ్‌ను నియమించారు.
గాయాలతో బాధపడుతున్న ఆయుష్ మాత్రే, విహాన్ మల్హోత్రా ఈ సిరీస్‌కు దూరమయ్యారు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిహాబిలిటేషన్ తర్వాత ఈ ఇద్దరూ వరల్డ్ కప్ జట్టుకు కెప్టెన్, వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతారని బీసీసీఐ తెలిపింది.
జనవరి 3, 5, 7న వరుసగా సౌతాఫ్రికాతో మూడు వన్డేలు బెనోనీలో జరగనున్నాయి. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరిగే వరల్డ్ కప్‌కు జింబాబ్వే, నమీబియా ఆతిథ్యం ఇస్తాయి. వరల్డ్ కప్‌లో 16 జట్లు నాలుగు గ్రూపుల్లో తలపడతాయి. తర్వాత సూపర్ సిక్స్ స్టేజ్, సెమీ ఫైనల్, ఫైనల్ ఉంటాయి. ఐదుసార్లు టైటిల్ నెగ్గిన ఇండియా.. గ్రూప్–బిలో అమెరికాతో (జనవరి 15), బంగ్లాదేశ్‌తో (17న), న్యూజిలాండ్ (24న)తో తలపడుతుంది.
ఇండియా వరల్డ్ కప్ టీమ్: ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుండు, హర్వన్ష్ సింగ్, అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, మహ్మద్ ఇనామ్, హెనిల్ పటేల్, దీపేశ్, కిషన్ కుమార్ సింగ్, ఉదవ్ మోహన్.
సౌతాఫ్రికా సిరీస్‌కు టీమ్: వైభవ్ సూర్యవంశీ (కెప్టెన్), ఆరోన్ జార్జ్ (వైస్ కెప్టెన్), వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుండు, హర్వన్ష్ సింగ్, అంబరీష్,
కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, మహ్మద్ ఇనామ్, హెనిల్ పటేల్, దీపేశ్,
కిషన్ కుమార్ సింగ్, ఉదవ్ మోహన్, యువరాజ్ గోహిల్, రాహుల్ కుమార్.
