గద్వాల టౌన్, వెలుగు: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. శనివారం తన ఛాంబర్ లో కరపత్రాలను రిలీజ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదవ తరగతితో పాటు ఆరు నుంచి 9వ తరగతి వరకు ఖాళీ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 21లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గురుకులాల జిల్లా సమన్వయకర్త శోభారాణి, ప్రిన్సిపాల్ రామాంజనేయులు ఉన్నారు.
