వన్డే ర్యాంకింగ్స్‌‌‌‌లో..మూడో ప్లేస్లోనే గిల్‌‌‌‌

వన్డే ర్యాంకింగ్స్‌‌‌‌లో..మూడో ప్లేస్లోనే గిల్‌‌‌‌

దుబాయ్‌‌‌‌: ఇండియా యంగ్‌‌‌‌ బ్యాటర్లు శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌, ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ కెరీర్‌‌‌‌ బెస్ట్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌లను సాధించారు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌‌‌‌లో శుభ్‌‌‌‌మన్‌‌‌‌ మూడో ర్యాంక్‌‌‌‌ నిలబెట్టుకున్నాడు.  ఇషాన్‌‌‌‌ ఏకంగా 12వ ప్లేస్‌‌‌‌లు ఎగబాకి 24వ ర్యాంక్‌‌‌‌లో నిలిచాడు. పాక్‌‌‌‌పై 82 రన్స్‌‌‌‌ చేయడంతో ఇషాన్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌ మెరుగైంది. 

విరాట్‌‌‌‌ కోహ్లీ పదో ర్యాంక్‌‌‌‌లో కొనసాగుతుండగా, బాబర్‌‌‌‌ ఆజమ్‌‌‌‌, డసెన్‌‌‌‌ టాప్‌‌‌‌2లో ఉన్నారు. బౌలర్లలో హైదరాబాదీ సిరాజ్‌‌‌‌ 4 నుంచి 8కి పడిపోయాడు.  ఆల్‌‌‌‌రౌండర్లలో హార్దిక్‌‌‌‌ పాండ్యా పదో ర్యాంక్‌‌‌‌లో నిలిచాడు.