
దుబాయ్: టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్–10లో చోటు సంపాదించాడు. బుధవారం (జులై 09) విడుదల చేసిన తాజా జాబితాలో గిల్ (807 రేటింగ్ పాయింట్లు) ఏకంగా 15 స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌లో నిలిచాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 150కి పైగా స్కోరు చేయడం అతని ర్యాంక్ మెరుగుపడటానికి దోహదం చేసింది. ఈ సిరీస్‌కు ముందు 23వ ర్యాంక్‌లో ఉన్న గిల్ గతంలో నమోదు చేసిన అత్యుత్తమ ర్యాంక్ 14. సెప్టెంబర్ 2023లో దీన్ని సాధించాడు.
యశస్వి జైస్వాల్ (858) నాలుగో ర్యాంక్‌లో ఎలాంటి మార్పు లేదు. రిషబ్ పంత్ (790) ఒక్క ప్లేస్ దిగజారి 8వ ర్యాంక్‌లో ఉన్నాడు. బౌలింగ్‌లో బుమ్రా (898) టాప్ ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు. జడేజా (680) 14వ ర్యాంక్‌లో ఉన్నాడు.