బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ పై రెండేళ్ల నిషేదం

బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ పై రెండేళ్ల నిషేదం

బంగ్లాదేశ్ టీ20, టెస్టు కెప్టెన్, ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ పై ఐసీసీ వేటు వేసింది. తనను బుకీలు సంప్రదించడంపై ఐసీసీకి రిపోర్టు ఇవ్వడంలో విఫలమైనందుకు షకీబ్ పై రెండేళ్లు నిషేదం విధించింది .షకీబ్ ఏడాది పాటు పూర్తి నిషేదం మరో ఏడాది సస్పెన్షన్ ఉంటుందని వెల్లడించింది. దీంతో  నవంబర్ 3 నుండి ఇండియాతో జరిగే మూడు టీ20 మ్యాచ్ లు, రెండు టెస్టు మ్యాచ్ లకు అతను దూరం కానున్నాడు.అలాగే వచ్చే ఏడాది ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ కు దూరం అవుతాడు.

2018లో ఐపీఎల్, ముక్కోణపు సిరీస్ లో షకీబ్ ను బుకీలు సంప్రదించారంటూ అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై విచారణ జరిపిన ఐసీసీ  షకీబ్ ను వివరణ కోరింది. అయితే షకీబ్ ఐసీసీకి వివరణ ఇవ్వడంలో విఫలమయ్యాడు.దీంతో నిషేదం విధించింది. అంతర్జాతీయ క్రికెట్లో షకీబ్ ఆల్ రౌండర్  జాబితాల్లో వన్డేల్లో నంబర్ 1 , టీ 20ల్లో 2, టెస్టుల్లో 3 వ స్థానంలో ఉన్నాడు.