హోరాహోరీగా టీ–20 వరల్డ్ కప్

హోరాహోరీగా టీ–20 వరల్డ్ కప్

టీ–20 వరల్డ్ కప్  ఇంట్రెస్టింగా మారింది. వరుణుడి ఆటతో గతంలో ఎప్పుడు లేనంతగా హోరాహోరీగా సాగుతోంది. సూపర్ లీగ్ దశలో ఇంకో ఆరు మ్యాచ్ లు మాత్రమే ఉన్నా... ఇప్పటి వరకు ఏ ఒక్క జట్టు సెమీస్ చేరలేదు. గ్రూప్–1లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్యే ప్రధాన పోటీ ఉంది. ఈ మూడు టీమ్స్.. తలో 5 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. చివరి మ్యాచ్ లో ఈ మూడు జట్లు గెలిస్తే.. రన్ రేట్ ఆదారంగా సెమీస్ కు చేరనున్నాయి. 

భారీ రన్ రేట్ కలిగిన ఐర్లాండ్ పై గెలిస్తే బెర్తు ఖాయమౌతుంది. ఓడినా అవకాశముంటుంది కానీ.. లాస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలవకూడదు. మరో మ్యాచ్ లో ఆప్గానిస్థాన్ ను ఆస్ట్రేలియా ఢి కొట్టనుంది. మరోవైపు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న లంక కూడా సెమీస్ చేరే అవకాశం ఉంది. తన చివరి మ్యాచ్ లో ఇంగ్లండ్ పై ఆ జట్టు గెలవాలి. దీంతో పాటు ఆప్గానిస్థాన్ చేతిలో ఆస్ట్రేలియా లేదా ఐర్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవాలి. ఐర్లాండ్, ఆప్గానిస్థాన్ ఇప్పటికే రేసు నుంచి తప్పుకున్నాయి. 

గ్రూప్–2లోనూ నాలుగు జట్లు రేసులో ఉన్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్, రెండ్ స్థానంలో ఉన్న సౌతాఫ్రికా తమ చివరి మ్యాచుల్లో గెలిస్తే డైరెక్టుగా సెమీస్ చేరుతాయి. భారత్ కు ఓడినా అవకాశం ఉంటుంది. కానీ దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ లలో ఓ జట్టు ఓడాలి. ఒక వేల భారత్ ఓడి.. సౌతాఫ్రికా, పాక్ గెలిస్తే.. దక్షిణాప్రికా సెమీస్ చేరుతోంది. దీంతో భారత్, పాక్ ఆరు పాయింట్లతో సమానంగా ఉంటాయి. అయితే రన్ రేట్ ఆధారంగా ఓ జట్టు సెమిస్ చేరే అవకాశం ఉంది. రన్ రేట్ లో వెనుకబడ్డ బంగ్లా సెమీస్ చేరాలంటే పాకిస్థాన్ పై గెలివాలి. దక్షిణాఫ్రికా ఓడాలి.