
దుబాయ్: ఇండియా స్పిన్నర్ దీప్తి శర్మ.. ఐసీసీ విమెన్స్ టీ20 ర్యాంక్ మెరుగుపర్చుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా జాబితాలో దీప్తి (732 పాయింట్లు) ఒక ప్లేస్ మెరుగుపడి సంయుక్తంగా రెండో ర్యాంక్‌లో నిలిచింది. పాక్ బౌలర్ సాదియా ఇక్బాల్ ఖాతాలో 732 ర్యాంకింగ్ పాయింట్లు ఉన్నా మూడో ప్లేస్‌కు పరిమితమైంది. ఆస్ట్రేలియా బౌలర్ అనాబెల్ సదర్లాండ్ (736) టాప్ ప్లేస్‌లో ఉండగా, సోఫీ ఎకిల్‌స్టోన్ (727), లారెన్ బెల్ (714) వరుసగా నాలుగు, ఐదో ర్యాంక్‌ల్లో ఉన్నారు.
వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్ స్మృతి మంధాన (728) టాప్ ప్లేస్ కోల్పోయి రెండో ప్లేస్‌కు పడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (645) పది ర్యాంక్‌లు మెరుగై 11వ ర్యాంక్‌లో నిలిచింది. ఇక టీ20 ర్యాంకింగ్స్‌లో మంధాన (767), షెఫాలీ వర్మ (655), జెమీమా (625), హర్మన్‌ప్రీత్ కౌర్ (613) వరుసగా 3, 9, 14, 16 ర్యాంక్‌ల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్స్ లిస్ట్‌లో దీప్తి శర్మ (387) మూడో ర్యాంక్‌లో నిలిచింది.