ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తున్న దేశాలతో మిగతా క్రికెట్ దేశాలు సంబంధాలను తెంచుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు బీసీసీఐ లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. శనివారం జరిగిన త్రైమాసిక బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించిన గవర్నింగ్ బాడీ సభ్యులు బీసీసీఐ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. ఈ సమావేశానికి ముందు ఐసీసీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ బీసీసీఐ ప్రతిపాదనను అమలు చేయడం చాలా కష్టమని మీడియాకు తెలిపారు. క్రికెట్‌నే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటామని, రాజకీయ సంక్షోభాలకు ఐసీసీలో తావులేదని తెలిపారు.
ఈ లేఖను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఖండించింది. ఈ లేఖ నేపథ్యంలో 2020 టీ20 ప్రపంచకప్, 2023 ప్రపంచకప్ లకు ఆతిథ్యమివ్వనున్న భారత్ తమ ఆటగాళ్లకు వీసాలు ఇస్తుందా? లేదా? అని ఐసీసీని ప్రశ్నించింది.
'Boycotting any country emanating terror not in ICC's hands'
Source @ANI story | https://t.co/rc2jrP1Yud pic.twitter.com/H1pyNsWrZO
— ANI Digital (@ani_digital) March 3, 2019

