క్రికెట్ బోర్డులకు ఐసీసీ హెచ్చరిక: క్రికెటర్లు జాగ్రత్త… మ్యాచ్ ఫిక్సింగ్ చేయోచ్చు

క్రికెట్ బోర్డులకు ఐసీసీ హెచ్చరిక: క్రికెటర్లు జాగ్రత్త… మ్యాచ్ ఫిక్సింగ్ చేయోచ్చు

కరోనా వైరస్‌ (కోవిడ్-19)తో ప్రపంచ దేశాలు పోరాడుతున్న ఈ కాలంలో బూకీలతో క్రికెటర్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది ఐసీసీ. ప్రపంచవాప్తంగా లాక్ డౌన్ ఉండటంతో క్రికెటర్లందరూ ఇంటికి పరిమితమయ్యారు. దీంతో పాటు కొందరు క్రికెటర్లు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తమ అభిమానులతో ముచ్చటిస్తుంటారు. అయితే ఇలా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే వారు మ్యాచ్ ఫిక్సర్లతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది ఐసీసీ. ఈ బూకీలు క్రికెటర్లతో మాటలు కలిపి ట్రాప్ చేస్తారని, భవిష్యత్తులో జరిగే మ్యాచ్‌లపై ఫిక్సింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది.

ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ చీఫ్ అలెక్స్ మార్షల్ విడుదల చేసిన ప్రకటనలో… ఫిక్సర్లు లాక్ డౌన్ ను పూర్తిగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారని  అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం క్రికెటర్లందరూ లాక్ డౌన్ లో ఉండటమే ఇందుకు కారణమని తెలిపారు. ఇలాంటి సందర్భాలలోనే బూకీలు యాక్టీవ్ అవుతారని చెప్పారు. ఈ విషయాన్ని అన్ని క్రికెట్ బోర్డులకు చేరవేశామని అప్రమత్తంగా ఉండాలని కోరామని ఆయన తెలిపారు.