ICC విమెన్స్ T20 ర్యాకింగ్స్ లో షెఫాలీ టాప్

ICC విమెన్స్ T20 ర్యాకింగ్స్ లో షెఫాలీ టాప్

మహిళల T20 ర్యాకింగ్స్ లో భారత యువ సంచలనం షెఫాలీ వర్మ టాప్‌లోనే కొనసాగుతోంది. ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు (ICC)  విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో షెఫాలీ(776 రేటింగ్‌ పాయింట్లు) ఫస్ట్ ప్లేస్ ను దక్కించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన మూనీ(744), మెగ్‌ లానింగ్‌(709) టాప్‌-3లో కొనసాగుతున్నారు. స్మృతి మంధాన 4వ స్థానంలో, జెమీమా రోడ్రిగ్స్‌ 9వ స్థానంలో నిలిచింది. ఆల్‌రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ 6వ ర్యాంక్‌, రాధా యాదవ్‌ 7వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. దీప్తి ఖాతాలో 705, రాధా ఖాతాలో 702 రేటింగ్‌ పాయింట్లు ఉండగా.. ఆస్ట్రేలియాకు చెందిన సోఫీ డివైన్‌ మొదటి స్థానంలో ఉంది.