సెప్టెంబర్ 8 నుంచి ఐసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్

సెప్టెంబర్ 8 నుంచి ఐసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో  అడ్మిషన్ల  ప్రక్రియ మొదలైంది. ఆన్​లైన్ రిజిస్ర్టేషన్లకు ఈ నెల11 వరకు గడువు ఇవ్వగా..శుక్రవారం నుంచే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవనుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారికి 13వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉంది. వారికి ఈ నెల17న సీట్ల కేటాయించనున్నారు. 

ఈ నేపథ్యంలో ఆయా కోర్సుల్లోని ఖాళీ సీట్ల వివరాలను విద్యాశాఖ సెక్టరీ వాకాటి కరుణ వెల్లడించారు. స్టేట్​లో 245 ఎంబీఏ కాలేజీల్లో 22,843 కన్వీనర్ కోటా సీట్లున్నాయని తెలిపారు. దీంట్లో 27 సర్కారు కాలేజీల్లో 1,735 సీట్లుండగా, 218 ప్రైవేటు కాలేజీల్లో 21,108 సీట్లున్నాయన్నారు. 47 ఎంసీఏ కాలేజీల్లో 3,042 సీట్లున్నాయని.. వీటిలో 16 సర్కారు కాలేజీల్లో 990 సీట్లు, 31 ప్రైవేటు కాలేజీల్లో 2052 సీట్లు ఉన్నట్టు పేర్కొన్నారు.