
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 20 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, కాలేజీల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. బుధవారం ఐసెట్ కమిటీ సమావేశం జరిగింది. ఫస్ట్ ఫేజ్ ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 20 నుంచి వచ్చేనెల 5 వరకూ ఉంటుందని ప్రకటించారు.
ఆగస్టు 20 నుంచి 28 వరకూ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ ఉంటుందని, 22 నుంచి 29 వరకూ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని ప్రకటించారు. ఈ నెల 25 నుంచి 30 వరకూ వెబ్ ఆప్షన్లు ప్రక్రియ నిర్వహిస్తామని.. సెప్టెంబర్ 2లోపు సీట్ల అలాట్మెంట్ ఉంటుందని తెలిపారు. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 8 నుంచి 16 వరకూ ఉంటుందని పేర్కొన్నారు.