ICMR రిక్రూట్ మెంట్ 2024: జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్

ICMR రిక్రూట్ మెంట్ 2024: జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్

ICMR రిక్రూట్ మెంట్ 2024: ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్(ICMR) నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ (NIRRCH) లో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

ICMR రిక్రూట్ మెంట్ 2024 కోసం 01 ఖాళీ సీటు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ పోస్టుకు  దరఖాస్తు చేయడానికి గరిష్టి వయోపరిమితి 28 సంవత్సాలు. ఎంపికైన అభ్యర్థులకు రూ. 31వేల స్టైఫండ్ ఉంటుంది. కాంట్రాక్టు ప్రాతిపదికన రిక్రూట్ చేయబడుతుంది. ఇంటర్వ్యూఆధారంగా ఎంపిక చేయబడుతుంది. 

విద్యార్హతలు: అభ్యర్థి బేసిక్సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. లేదా ప్రొఫెషనల్ కోర్సులో గ్రాడ్యుయేట్ /పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొంది ఉండాలి. అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో సంబంధిత పత్రాలతో పాటు పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ ను తీసుకురావాలి. 

ఇంటర్వ్యూ: మార్చి 08, 2024, ICMR నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ ,JM  స్ట్రీట్, పరేల్,  ముంబైలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు జరుగుతుంది. రిపోర్టింగ్ సమయం 10.15 AM. ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించరు. 
కాంట్రాక్టు కాలం : 1 సంవత్సరం. 

Also Read : ఇండియన్ రిమోట్​ సెన్సింగ్​ (ఐఆర్​ఎస్​)