కృష్ణా నదిపై వెయ్యి కోట్లతో ఐకానిక్​ వంతెన

కృష్ణా నదిపై వెయ్యి కోట్లతో ఐకానిక్​ వంతెన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా నదిపై వెయ్యి కోట్లతో ఐకానిక్​ బ్రిడ్జి​ నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్​గడ్కరీ వెల్లడించారు. సరికొత్త తరహాలో నిర్మించనున్న  బ్రిడ్జి​ వివరాలు, నమూనా ఫొటోలను ఆయన ట్విట్టర్​లో షేర్​ చేశారు. తెలంగాణ పరిధిలోని నాగర్ కర్నూలు జిల్లా సోమశిల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా సంగమేశ్వరం వరకు కృష్ణా నదిపై అడ్డంగా ఈ బ్రిడ్జిని నిర్మించనున్నారు.

రూ.1,082 కోట్ల అంచనాతో నిర్మించనున్న ఈ వంతెనను 30 నెలల్లో దీన్ని పూర్తి చేస్తామన్నారు.  బ్రిడ్జిలో పాదచారుల మార్గం పూర్తిగా గాజుతో ఏర్పాటు చేస్తామని.. ఇది దేశంలో కేబుల్, సస్పెన్షన్ టెక్నాలజీతో నిర్మించనున్న తొలి వంతెనగా నిలుస్తుందని  కేంద్ర మంత్రి గడ్కరీ వివరించారు. ఈ బ్రిడ్జి​  పూర్తయితే హైదరాబాద్‑ తిరుపతి మధ్య దాదాపు 80 కి.మీ. దూరం తగ్గుతుంది. అలాగే హైదరాబాద్ నుంచి శ్రీశైలం మధ్య దూరం 50కిలోమీటర్లు తగ్గుతుంది. నల్లమల అడవుల్లో శ్రీశైలం రిజర్వాయర్​కు ఎగువ భాగాన దీన్ని నిర్మిస్తుండడంతో టూరిస్ట్ స్పాట్​గా మారనుంది.