న్యూఢిల్లీ: భారతదేశ రియల్ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.4శాతంగా ఉంటుందని, 2024–25 లో నమోదైన 6.5శాతంతో పోలిస్తే ఎక్కువని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్‌లో) జీడీపీ వృద్ధి రేటు 8శాతంగా ఉందని, చివరి ఆరు నెలల్లో ఎగుమతుల మందగింపు, బేస్ ఎఫెక్ట్ వల్ల 7శాతం కంటే తక్కువగా నమోదవ్వొచ్చని తెలిపింది.
జీడీపీ వృద్ధి రేటుపై ఆర్‌బీఐ ఫిబ్రవరి ఎంపీసీ మీటింగ్ ప్రభావం, భవిష్యత్ నిర్ణయాలు, కేంద్ర బడ్జెట్, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రభావితం చేస్తాయని పేర్కొంది. ‘‘జీఎస్‌టీ తగ్గింపులు, పండుగ డిమాండ్ వల్ల అక్టోబర్–డిసెంబర్‌లో వినియోగం, తయారీ పెరిగాయి.
రిటైల్ ద్రవ్యోల్బణం కిందటి ఆర్థిక సంవత్సరంలోని 4.6శాతం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2శాతానికి తగ్గొచ్చు. హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 0.4శాతంగా ఉంటుందని అంచనా”అని ఇక్రా వివరించింది.
