
న్యూఢిల్లీలోని ఇంటెలిజెన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(ఐసీఎస్ఐఎల్) ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 07.
పోస్టుల సంఖ్య: 02 (ప్రాజెక్ట్ అసోసియేట్)
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి ఎన్విరాన్మెంట్/ ఫారెస్ట్రీ/ బయోడైవర్సిటీ సంబంధిత సైన్స్ విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా బి.టెక్/ బీఈ/ బీఆర్క్ డిగ్రీతోపాటు పని అనుభవం ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 07.
అప్లికేషన్ ఫీజు: అందరు అభ్యర్థులకు రూ.590.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, విద్యార్హతలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు icsil.in వెబ్సైట్లో సంప్రదించగలరు.