AI సిస్టమ్ ద్వారా మాస్క్ లేని వారిని గుర్తింపు

AI సిస్టమ్ ద్వారా మాస్క్ లేని వారిని గుర్తింపు

కరోనా కట్టడిలో భాగంగా మాస్కులు  లేకుండా బయటకు వచ్చేవారికి రూ. వెయ్యి జరిమానా విధిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మాస్కులు లేకుంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు కూడా హెచ్చరించారు. అయినా కొందరు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు.

మాస్కులు ధరించకుండా బయట తిరుగుతున్న వారిని గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఉపయోగించేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీసులు సిద్ధమవుతున్నారు. మాస్క్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారిని గుర్తించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) సిస్టమ్ ను పోలీసులు ఉపయోగించనున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఈ టెక్నాలజీని అమలు చేయబోతున్నారు. ఆ తర్వాత దీన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయనున్నారు పోలీసులు.