హర్యానా ప్రభుత్వ ఖాతాల నుంచి.. రూ.590 కోట్లు కొట్టేసిన ఐడీఎఫ్‌‌‌‌సీ ఫస్ట్ ఉద్యోగులు

హర్యానా ప్రభుత్వ ఖాతాల నుంచి.. రూ.590 కోట్లు కొట్టేసిన  ఐడీఎఫ్‌‌‌‌సీ ఫస్ట్ ఉద్యోగులు

న్యూఢిల్లీ: ఐడీఎఫ్‌‌‌‌సీ ఫస్ట్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌కి చెందిన కొంత మంది ఉద్యోగులు హర్యానా ప్రభుత్వానికి చెందిన అకౌంట్ల నుంచి ఏకంగా రూ.590 కోట్లు కొట్టేశారు.  చండీగఢ్ బ్రాంచ్‌‌‌‌లోని కొంతమంది ఉద్యోగులు, ఇతర వ్యక్తులు అనధికారిక లావాదేవీలు జరిపారని బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌లో పేర్కొంది. పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపింది.  ‘‘హర్యానా ప్రభుత్వానికి చెందిన ఒక డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ మా వద్ద బ్యాంక్ అకౌంట్‌‌‌‌ను మెయింటైన్ చేస్తోంది. బ్యాంక్‌‌‌‌ అకౌంట్ క్లోజర్‌‌‌‌‌‌‌‌, బ్యాలెన్స్ ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌కు రిక్వెస్ట్‌‌‌‌ అందింది. 

ఈ ప్రాసెస్‌‌‌‌లో అవతవకలు బయటపడ్డాయి. ఫిబ్రవరి 18 తర్వాత ఇలాంటి పరిస్థితే హర్యానా ప్రభుత్వ డిపార్ట్‌‌‌‌మెంట్లకు చెందిన మరికొన్ని అకౌంట్లలో కనిపించింది”అని బ్యాంక్ వివరించింది.  ప్రస్తుతం రూ.590 కోట్లు నష్టంగా అంచనా వేసినా, పూర్తి రివ్యూ తర్వాత తుది మొత్తం మారొచ్చు.  నలుగురు  ఉద్యోగులను సస్పెండ్ చేశామని, రికవరీ కోసం ఇతర బ్యాంకులకు “రీకాల్‌‌‌‌ రిక్వెస్ట్‌‌‌‌”పంపామని తెలిపింది.