
గచ్చిబౌలి, వెలుగు: నకిలీ సర్టిఫికెట్తయారు చేసి, యూఎస్‌లోని ఓ వర్సిటీలో అడ్మిషన్ఇప్పించిన ఐఈసీ కన్సల్టెన్సీ నిర్వాహకుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడకు చెందిన దీపక్‌రెడ్డి అమెరికాలోని ఓ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం పంజాగుట్టలో ఉన్న ఐఈసీ కన్సల్టెన్సీ నిర్వాహకుడు వెంకటకిరణ్ను 2022లో సంప్రదించాడు. ఇందుకోసం అతను రూ.2.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
దీపక్‌రెడ్డి రాజస్థాన్‌లోని మేవార్వర్సిటీలో బీటెక్చదివినట్లు నకిలీ సర్టిఫికెట్సృష్టించి, అమెరికాలోని యూనివర్సిటీలో అడ్మిషన్ఇప్పించాడు. ఈ విషయాన్ని దీపక్‌రెడ్డి తన తల్లిదండ్రులకు చెప్పగా.. నకిలీ సర్టిఫికెట్తో అక్కడ ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. దీంతో అతను పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు.
ఎస్వోటీ, గచ్చిబౌలి పోలీసులు శుక్రవారం వెంకట కిరణ్‌ను అరెస్ట్‌చేశారు. ఇప్పటివరకు ఎన్ని నకిలీ సర్టిఫికెట్లు తయారు చేశాడు.. ఎంత మందిని ఉన్నత చదువుల కోసం ఇతర దేశాలకు పంపించాడనే వివరాలపై ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు.