V6 News

పుల్వామాలో 30 కిలోల ఐఈడీ రికవరీ

పుల్వామాలో 30 కిలోల ఐఈడీ రికవరీ

జమ్ముకశ్మీర్ లో భద్రతా బలగాలు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశాయి . స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు 30 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి. పుల్వామా పోలీసులు, భద్రతా దళాలకు ఐఈడీ రవాణా గురించి పక్కా సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టారు. పుల్వామాలోని తహాబ్ క్రాసింగ్ దగ్గర 30 కిలోల ఐఈడీని భద్రతాబలగాలు రికవరీ చేసుకున్నాయి . వెంటనే దాన్ని డిఫ్యూజ్ చేశాయి.

మరోవైపు కశ్మీర్ లో భద్రతను కట్టుదిట్టం చేశాయి అధికారులు. రైల్వే స్టేషన్లలో నిఘా పెట్టారు. పంద్రాగస్టు సందర్భంగా అదనపు బలగాలను రంగంలోకి దించారు. ఉధంపూర్-కాట్రా రైల్వే లింక్ దగ్గర భారీగా బలగాలు మోహరించాయి. స్పెషల్ డాగ్ స్క్వాడ్, రైల్వే భద్రతా దళం స్టేషన్ల పరిసరాల్లో గస్తీ కాస్తున్నాయి. ప్రయాణికులు, వారి సామగ్రిని తనిఖీ చేస్తున్నారు అధికారులు.