రైలు పట్టాలపై చెత్త వేస్తే జరిమానా

రైలు పట్టాలపై చెత్త వేస్తే జరిమానా

స్వచ్ఛభారత్‌లో భాగంగా భారత రైల్వే సంస్థ పలు చర్యలు చేపట్టింది. ఇకపై రైలు పట్టాలపై చెత్త పడేస్తే 5 వేల రూపాయల జరిమానా వసూలు చేయనున్నట్టు తెలిపింది. రైల్వేస్టేషన్‌లో తాగునీరు, పరిశుభ్రత, నిషేధిత వస్తువుల తొలగింపు విషయమై ప్రత్యేక టీంను ఏర్పాటు చేసింది. దక్షిణ రైల్వేలో ఒక్కో స్టేషన్‌కు సంబంధించి ప్రత్యేక అధికారిని నియమించడంతో పాటు, నివేదికను కూడా సమర్పించాలని సూచించింది. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై ఎంజీఆర్‌ సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ సహా 19 రైల్వేస్టేషన్లను ఎంపిక చేసింది. అలాగే సబర్బన్‌ రైల్వేస్టేషన్లైన తాంబరం, చెంగల్పట్టు, ఆవడి, తిరువళ్ళూరు, కాట్పాడి, పెరంబలూరు, జోలార్‌పేట, మాంబళం, గూడువాంజేరి, పెరుంగొళత్తూర్‌, తిరుత్తణి, సింగపెరుమాళ్‌ కోయిల్‌, చెన్నై బీచ్‌, గిండి తదితర రైల్వేస్టేషన్ల పట్టాలపై చెత్త పడేసే వ్యక్తుల దగ్గర నుంచి రూ.5 వేలు జరిమానా వసూలు చేయనున్నారు. త్వరలో ఈ విధానం అమలుకు రానుందని రైల్వే అధికారులు తెలిపారు.