పార్టీలో చేరమంటే రూ.25 కోట్లు అడిగిండు : మందకృష్ణ మాదిగపై కేఏ పాల్ ఆరోపణ

పార్టీలో చేరమంటే రూ.25 కోట్లు అడిగిండు :  మందకృష్ణ మాదిగపై కేఏ పాల్ ఆరోపణ
  • పార్టీలో చేరమంటే రూ.25 కోట్లు అడిగిండు
  • మందకృష్ణ మాదిగపై కేఏ పాల్ ఆరోపణ

హైదరాబాద్ : తన పార్టీలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను చేరమంటే రూ. 25 కోట్లు అడిగారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. మాదిగలకు మోదీ ఇన్ని రోజులకు చేయని న్యాయం ఇప్పుడు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. బీఆర్కే భవన్ లోఎన్నికల సంఘం అధికారులను కలిసి తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు కామన్ సింబల్ కేటాయించాలంటూ కోరారు.

అనంతరం పాల్ మీడియాతో మాట్లాడుతూ పరేడ్ గ్రౌండ్ లో సభ పెట్టడానికి మందకృష్ణ మాదిగకు రూ. 72 కోట్లు ముట్టాయి. మోదీని ఘోరమైన తిట్లుతిట్టిన ఆయన ఇప్పుడు దేవుడు అంటున్నడు. మందకృష్ణకు ఒక ఎంపీ ఇస్తానని చెప్పడంతో అమ్ముడు పోయిండు. నరేంద్ర మోదీ బీసీ కాదు, ఆయన సర్టిఫికెట్లు అన్నీ డూబ్లికేట్. ప్రధాని నా శిష్యుడు. ఆయనకు నేను భయపడను. తెలంగాణలో మూడు పార్టీలకు ఓట్లు వేయకండి.. 30న ఓట్లు వేయకుండా ఇంట్లో కూర్చోండి’ అంటూ పాల్ వ్యాఖ్యానించారు.