రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ ను గద్దె దించాలి: మాయావతి

రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ ను గద్దె దించాలి: మాయావతి

తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి వస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే ముఖ్యమంత్రి అని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. తన ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి సేవ చేయడానికి వచ్చారని..అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ అభివృద్థి చెందుతుందన్నారు. రాష్ట్రంలో బీఎస్పీని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. 

అంబేద్కర్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి మండిపడ్డారు. అంబేద్కర్ పేరుతో కేసీఆర్ చేస్తున్న నాటకాలు బంద్ చేయాలని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని మార్చుతానని కేసీఆర్ అన్నారని..అలాంటి వ్యక్తిని ఓడించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ సర్కారు తీరుతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. తాము యూపీలో అధికారంలో ఉన్నప్పుడు అక్కడి దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేశామని..ఆ పథకాన్నే కేసీఆర్ కాపీ కొట్టారని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేయలేదన్నారు. బిహార్ లో  తెలంగాణ ఐఏఎస్ అధికారిని చంపిన గ్యాంగ్ స్టర్ ను  విడుదల చేస్తే..కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడేదన్నారు.

దేశంలో అంబేద్కర్ లక్ష్యాలు ఇప్పటికీ నెరవేరలేదని మాయావతి అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగంలో హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాల మద్దతుతో యూపీలో ప్రభుత్వం ఏర్పాటు చేశామని..యూపీలో ఎస్సీ,ఎస్సీ మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించామన్నారు. తెలంగాణలోనూ అధికారంలోకి వస్తే యూపీ తరహా పాలన అందిస్తామన్నారు. యూపీలో అన్ని పార్టీల వలే ముందే మేనిఫెస్టో ప్రకటించలేదని....అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను ప్రకటించామన్నారు. రాష్ట్రంలో  బీఎస్పీ బలోపేతం అవడంతో కేసీఆర్ కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. బీఎస్పీకి కార్యకర్తలే ప్రధాన బలం అని చెప్పారు.  ఎన్నికల టైంలో నిరుద్యోగులకు మోసం చేయడం కామన్ అయిందని..నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని..నిరుద్యోగ భృతి కాదన్నారు.  

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో బీఎస్పీ పాత్ర కూడా ఉందని మాయావతి అన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుకు బీఎస్పీ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. అంబేద్కర్ ఓబీసీలకు కూడా ప్రత్యేకమైన హక్కులను కల్పించారని చెప్పారు. అంబేద్కర్ లక్ష్యాలను కాన్షిరాం ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. అంబేద్కర్కు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేసినా కేంద్రంలోని ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భారత రత్న ఇవ్వలేదని....బీజేపీలో అధికారంలో ఉన్నా కూడా ఇవ్వడం లేదన్నారు. తమకు ఎలాంటి అధికారం, పదవులు అక్కరలేదని..అంబేద్కర్ కు భారత రత్న, మండల్ కమిషన్ ను  అమలు చేస్తే చాలన్నారు.