ఇల్లు కొంటే డౌన్‌‌‌‌పేమెంట్‌‌‌‌ ఎక్కువుండాలి : ఎనలిస్టులు

ఇల్లు కొంటే డౌన్‌‌‌‌పేమెంట్‌‌‌‌ ఎక్కువుండాలి : ఎనలిస్టులు
  • హోమ్‌‌‌‌ లోన్‌‌‌‌పై ..ఆధారపడడం తగ్గుతుంది
  • లోన్ పొందడం ఈజీ అవుతుంది: ఎనలిస్టులు

న్యూఢిల్లీ : సొంత ఇల్లు ఉండాలని అందరూ ఆశపడతారు. ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌  గరిష్టాల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో  ఇల్లు గడపడమే కష్టంగా మారుతోంది మధ్యతరగతి కుటుంబాలకు. అలాంటిది ఇల్లు కొనుక్కోవాలంటే హోమ్‌‌‌‌ లోన్‌‌‌‌పై ఆధారపడక తప్పడం లేదు. కానీ, హోమ్‌‌‌‌ లోన్‌‌‌‌పై ఎక్కువగా ఆధారపడితే ఇబ్బందులు తప్పవని గుర్తు పెట్టుకోవాలి. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ రూల్స్ ప్రకారం, ప్రాపర్టీ వాల్యూలో 80 శాతం వరకు హోమ్‌‌‌‌ లోన్‌‌‌‌ కింద పొందొచ్చు. అంటే సగటున రూ.30 లక్షల కంటే ఎక్కువ లోన్ పొందడానికి వీలుంటుంది. కానీ, మిగిలిన 20 శాతం అమౌంట్‌‌‌‌ను బయ్యర్లు సొంతంగా కట్టుకోవాల్సి ఉంటుంది. ప్రాపర్టీ కొనేముందు డౌన్ పేమెంట్‌‌‌‌ వీలున్నంత ఎక్కువ కట్టుకోవాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. డౌన్ పేమెంట్ ఎక్కువ కట్టకపోతే హోమ్‌‌‌‌ లోన్‌‌‌‌పై ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుందని, ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌లో ప్రాపర్టీ అమ్మాలంటే ఇబ్బందవుతుందని  చెబుతున్నారు. 

హోమ్‌‌‌‌ లోన్ ఈఎంఐ భారం తగ్గించుకోండి..

ఇప్పటికే  హోమ్ లోన్‌‌‌‌ తీసుకొని ఈఎంఐలు కడుతున్న వారు వీలున్నంత ఎక్కువ లోన్‌‌‌‌ను ముందుగానే తీర్చేయాలని (ప్రీపేమెంట్‌‌‌‌) ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. వాల్యూ ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌ నిఖిల్‌‌‌‌ గంగిల్‌‌‌‌ తన ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌ను ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో పంచుకున్నారు. కేవలం 36 ఈఎంఐలను ముందుగానే చెల్లించడంతో  తన లోన్ టెనూర్‌‌‌‌ (కాల పరిమితి)‌‌‌‌ 360 నెలల నుంచి 121 నెలలకు తగ్గిందని వివరించారు. 

203 నెలల విలువైన  వడ్డీని  ఆదా చేశానని చెప్పారు. ‘కరోనా టైమ్‌‌‌‌లో హోమ్‌‌‌‌ లోన్ తీసుకున్నాను. లోన్ టెనూర్‌‌‌‌‌‌‌‌ 240 నెలలు. లోన్ తీసుకునే టైమ్‌‌‌‌లో వడ్డీ 6.85 శాతంగా ఉంది. కానీ, ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ వడ్డీ రేట్లు పెంచడంతో వడ్డీ 9.35 శాతానికి పెరిగింది. బ్యాంక్‌‌‌‌  ఈఎంఐ పెంచకుండా టెనూర్‌‌‌‌‌‌‌‌ను పెంచింది. దీంతో నా లోన్ టెనూర్‌‌‌‌‌‌‌‌ 370 నెలలకు పెరిగింది’ అని నిఖిల్ గంగిల్ వివరించారు. ఆ తర్వాత తన లోన్‌‌‌‌లో కొంత వాటాను ముందుగానే చెల్లాంచాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. 

సుమారు రెండేళ్ల పాటు డబ్బులు సేవ్ చేశానని ఐదు నెలల గ్యాప్‌‌‌‌లోనే 36 ఈఎంఐలు చెల్లించానని అన్నారు. ఫలితంగా తన ఈఎంఐ కొద్దిగా పెరిగినా లోన్ టెనూర్‌‌‌‌‌‌‌‌ 121 నెలలకు తగ్గిందని అన్నారు.  తాను లోన్ తీసుకొని మూడేళ్లు అవుతోందని చెప్పారు. ‘బ్యాంకులు హోమ్‌‌‌‌ లోన్లపై వేస్తున్న వడ్డీలో 75 శాతాన్ని మొదటి 5–7 ఏళ్లలోనే వసూలు చేస్తాయి. ఈ టైమ్‌‌‌‌లో చెల్లించే ఈఎంఐలలో  అసలు కేవలం 25 శాతమే ఉంటుంది. 7 ఏళ్లు దాటాక చెల్లించే ఈఎంఐలలో వడ్డీ తక్కువగా ఉంటుంది’ అని నిఖిల్ గంగిల్‌‌‌‌ పేర్కొన్నారు. అన్ని బ్యాంకులు ఇలానే పనిచేస్తాయని చెప్పారు. వడ్డీ భారాన్ని తగ్గించుకోవాలంటే వీలున్నంత ఎక్కువ లోన్‌‌‌‌ను ముందుగానే చెల్లించాలన్నారు.