
పిల్లలకు బ్యాలెన్స్‌డ్ డైట్ చాలా ముఖ్యం. తగినన్ని న్యూట్రియెంట్స్, విటమిన్స్ సరిగ్గా అందినప్పుడే పిల్లల్లో సరైన గ్రోత్ ఉంటుంది. ఎదిగే పిల్లలకు ఎముకలకు తగినంత క్యాల్షియం అంది బలంగా ఉన్నప్పుడే, మంచి హైట్ పెరుగుతారు. ఫుడ్‌లో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్, ఫ్యాట్స్ వంటివి తగినంత ఉండేలా చూడాలి. జంక్ ఫుడ్ తగ్గించి, జింక్–రిచ్ ఫుడ్స్ ఇవ్వాలి. పిల్లల వయసుకు తగ్గ ఫిజికల్ యాక్టివిటీస్, గేమ్స్, ఎక్సర్‌సైజ్‌లు చేయించాలి. ముఖ్యంగా నెక్ ఎక్సర్‌సైజ్ హైట్ గ్రోత్‌లో హెల్ప్ చేస్తాయి.
పిల్లలు రోజూ కనీసం ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూడాలి. ఇది హైట్ గ్రోత్‌కు చాలా సాయపడుతుంది. పిల్లల పోశ్చర్ సరిగ్గా ఉండేలా చూడాలి. అంటే కూర్చున్నా, నిలబడ్డా వెన్నెముక నిటారుగా ఉండాలి. అటూ ఇటూ వంకర తిరిగి ఉండకుండా, సరైన పోశ్చర్‌లో ఉండేలా చూడాలి. దీనివల్ల వెన్నెముకపై ఒత్తిడి తగ్గి, మంచి గ్రోత్ ఉంటుంది. పిల్లలు హైట్ పెరగాలంటే చేయించాల్సిన మరో ఫిజికల్ యాక్టివిటీ ‘స్కిప్పింగ్’. దీనివల్ల బాడీ స్ట్రెచ్ అయ్యి, ఎత్తు పెరిగేందుకు హెల్ప్ అవుతుంది.