ఫ్రెండ్స్ పెళ్లి చేసుకుంటే.. అర్థం చేసుకునే ఛాన్స్ ఎక్కువ

ఫ్రెండ్స్ పెళ్లి చేసుకుంటే.. అర్థం చేసుకునే ఛాన్స్ ఎక్కువ

ఫ్రెండ్ షిప్, మ్యారేజ్ ఈ రెండూ లైఫ్ చాలా ఇంపార్టెంట్ రిలేషన్స్. అలాగే ఇవి చాలా గట్టి బంధాలు కూడా. ప్రతి ఒక్కరికీ అవసరమైనవి కూడా. వీటిలో ఏది లేకపోయినా లైఫ్ కంప్లీట్గా అనిపించదు. కొంతమంది పెళ్లైతే ఫ్రెండ్షిప్ కి దూరం కావాల్సి వస్తుందన్న ఆలోచనతో బెస్ట్ ఫ్రెండ్ నే పెళ్లిచేసుకుంటారు.

• స్నేహం ప్రేమగా మారి పెళ్లికి దారితీస్తుంది. ఇద్దరు స్నేహితులు పెళ్లి చేసుకోవడం అనేది చాలా మంచి విషయం. అలాగని వాళ్ల రిలేషన్ లో ఎలాంటి ఒడిదుడుకులు రావని కాదు. వచ్చినా వాటిని ఎలా ఎదుర్కోవాలో వాళ్లకి బాగా తెలుస్తుంది.

• అర్థం చేసుకునే ఛాన్స్ ఎక్కువ. మామూలుగానే ఫ్రెండ్స్ అన్నాక కమ్యూనికేషన్ వెరైటీగా ఉంటుంది. కళ్లతో, సైగలతో మాట్లాడతారు. చాలా సందర్భాల్లో వాళ్లతో మాట్లాడక పోయినా వాళ్ల మనసులో ఉన్నదేంటో గ్రహించగలిగేది ఒక్క ఫ్రెండ్ మాత్రమే. అందుకే ఫ్రెండ్.. పార్టనర్ అయితే మనసు తెలుసుకోవడం ఈజీ అవుతుంది. అంతే కాదు, ఎంతమందిలో ఉన్నా మూగభాషలో కూడా ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు.

• బెస్ట్ ఫ్రెండ్ పార్ట్నర్ అయితే.. ఏ విషయాన్నైనా సూటిగా చెప్పేస్తారు. ఎలాంటి భయం ఉండదు. కోపంగా అయినా, ప్రేమగా అయినా మనసులో ఉన్న విషయాన్ని బయటపెడతారు.

• నిజాయితీ అనేది ఏ రిలేషన్ కైనా చాలా ఇంపార్టెంట్. బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య నిజాయితీ ఉంటుంది. బుజ్జగించడం, కన్విన్స్ చేయడం. లాంటివి ఉండవు. ఏ రిలేషన్ అయినా నిలబడటానికి నిజాయితీ చాలా ముఖ్యం.

• గొడవలు ప్రతి రిలేషన్షిప్లోనూ ఉండేవే. కాకపోతే వాటిని ఎలా ఆపగలమన్నది ఆలోచించాలి. చాలావరకు లైఫ్ పార్టనర్ తో గొడవ పడితే ఎక్కువసేపు దాన్ని కంటిన్యూ చేయలేరు. ఎందుకంటే వాళ్లు ఆ ఎడబాటును భరించలేరు. వెంటనే కలిసిపోతారు. మరి పార్టనర్ ప్లేస్లో బెస్ట్ ఫ్రెండ్ ఉంటే, గొడవ జరిగినంత టైం కూడా పట్టదు, మళ్లీ వాళ్లు కలిసిపోవడానికి.

• భార్యాభర్తలన్నాక సర్దుకుపోవాలి అంటుంటారు. నిజమే. కానీ, బెస్ట్ ఫ్రెండ్ని మ్యారేజ్ చేసుకున్నవాళ్లకి ఎక్కువ కాలం అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్లు అంతకుముందు ఎలా ఉన్నారో, ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసు. కాబట్టి వాళ్ల ఫ్యామిలీస్ తో కలిసిపోవడానికి ట్రై చేసేటప్పుడు మాత్రమే అడ్జస్ట్మెంట్ అవసరం.

• ఉదాహరణకి, ఏదైనా విషయం మీద ఒకరు చిరాకు పడితే.. వాళ్లను ఎలా కూల్ చేయాలో ఫ్రెండ్కి బాగా తెలుస్తుంది. పైగా నిమిషాల్లో నవ్విస్తారు. పార్ట్నర్ ఏదైనా విషయం చెప్పినప్పుడు దాన్ని అంగీకరిస్తే, అంతకంటే అర్థం చేసుకునేవాళ్లుండరు. వాళ్లను సపోర్ట్ చేయాలి. అంతేకానీ, చిరాకు తెప్పించే ప్రశ్నలు వేయకూడదు.

• ఫైనల్గా పార్ట్నర్స్ బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటే లైఫ్ సాఫీగా సాగిపోతుంది. బెస్ట్ ఫ్రెండ్స్ పార్ట్నర్స్ అయితే ఇంకా బాగుంటుంది.