గుజరాతీలు, రాజస్థానీలు వెళ్లిపోతే.. ముంబై పనంతే!

గుజరాతీలు, రాజస్థానీలు వెళ్లిపోతే.. ముంబై పనంతే!

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీపై శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే  ఫైర్ అయ్యారు.  ‘‘గుజరాతీలు, రాజస్థానీలు వెళ్లిపోతే ముంబై నగరం ఆర్థిక రాజధానిగా ఉండదు’’ అని కోష్యారీ చేసిన వ్యాఖ్యలను ఉద్ధవ్ తప్పుపట్టారు. ఇటువంటి వ్యాఖ్యల ద్వారా గవర్నర్ మరాఠీలను అవమానించారని పేర్కొన్నారు.  హిందువులను విభజించేలా కోష్యారీ కామెంట్స్ ఉన్నాయన్నారు. వెంటనే గవర్నర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కోష్యారీని ఇంటికి పంపాలా లేక జైలుకు పంపాలా అనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని సూచించారు.  

స్పందించిన సీఎం  ఏక్ నాథ్ ..

ఈనేపథ్యంలో స్పందించిన సీఎం  ఏక్ నాథ్ షిండే .. గవర్నర్ వ్యాఖ్యలను  సమర్థించబోమన్నారు.  రాజ్యాంగంలోని  నీతి సూత్రాలకు  గవర్నర్  కట్టుబడి మాట్లాడాలన్నారు. మరాఠీ  ప్రజల సహకారాన్ని  ముంబై  ఎప్పటికీ  మర్చిపోలేదని అభిప్రాయపడ్డారు.

ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడారు

భగత్ సింగ్ కోష్యారీ ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడారని  ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే చెప్పారు. గవర్నర్ స్థానంలో ఉన్న వ్యక్తి అందరినీ సమానంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. భగత్ సింగ్ కోష్యారీని గవర్నర్ పదవి నుంచి తొలగించాలని రాష్ట్రపతిని కోరుతామని వెల్లడించారు.