
లండన్: ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ పై వెరైటీ కామెంట్స్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్. తనకే ఓ సోదరి ఉంటే కచ్చితంగా బెన్ స్టోక్స్ కు ఇచ్చి పెళ్లి చేసేవాడినని చెప్పి హాట్ టాపిక్ అయ్యాడు. యాషెస్ సిరీస్‌లో మూడో టెస్టులో ఇంగ్లాండ్‌కు చిరస్మరణీయ విజయం అందించిన బెన్ స్టోక్స్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రతి ఒక్కరూ అతడి ప్రతిభను మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు గ్రేమ్ స్వాన్ ఇలా ట్వీట్ చేశాడు. ‘నాకు అక్కాచెల్లెల్లు లేరు. కానీ నాకే ఓ సోదరి ఉంటే మాత్రం అతడికిచ్చి పెళ్లి చేస్తాను’ అని తెలపడంతో అతడి కామెంట్స్ ట్విటర్ లో ఫైర్ సృష్టించాయి.
స్వాన్ ట్వీట్ ను విపరీతంగా రీట్వీట్ చేస్తున్నారు. కొందరు కామెడీతో బదులిస్తున్నారు. ‘నాకేం ఆలోచనలు లేవు. బెన్ స్టోక్స్ ను పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలని అనుకుంటున్నాను’, ‘స్వాన్.. నేనే అతడిని పెళ్లి చేసుకోవాలని నా భావన’, ‘నాకైతే చెల్లెల్లు లేరు. కానీ ఒకరిని దత్తత తీసుకోవాలని మా అమ్మను అడుగుతాను, అతడికిచ్చి పెళ్లిచేయమంటాను’ అని ట్వీట్లు చేస్తున్నారు. ఒకరైతే.. ‘ఇది 21వ శతాబ్దం స్వాన్, నువ్వే అతడిని పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఎంతోమంది ఆ వరుసలో ఉండొచ్చు’ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అయ్యింది.
I have no sister but if I did I’d want her to marry Ben Stokes.
— Graeme Swann (@Swannyg66) August 25, 2019