పాజిటివ్ వస్తే ఓనర్లు ఇంట్ల ఉండనిస్తలేరు

పాజిటివ్ వస్తే ఓనర్లు ఇంట్ల ఉండనిస్తలేరు
  •  పాజిటివ్ వస్తే ఇంట్ల ఉండనిస్తలేరు
  • బాధితుల్లో మెడికల్ స్టాఫ్,సర్కార్‌ ఉద్యోగులు
  • ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లు ఉండాలంటున్న ఎక్స్‌పర్ట్స్
  • కొన్ని జిల్లాల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న ఆఫీసర్లు

జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన జనార్దన్‌‌కు నాలుగు రోజుల కింద కరోనా పాజిటివ్ వచ్చింది. జగిత్యాల హాస్పిటల్ నుంచి అంబులెన్స్‌‌లో హోం ఐసోలేషన్‌‌కు పంపించారు. కిరాయి ఇంట్లకు రాకుండా ఓనర్ అడ్డు కున్నాడు. చేసేది లేక అదే అంబులెన్స్‌‌లో మెట్‌పల్లి హాస్పిటల్‌‌కు తీసుకెళ్లారు. వాళ్లు పర్మిషన్ ఇయ్యకపోవడంతో ఓ పూటంతా మార్చురీ పక్కనే ఉన్నాడు. కరోనా సోకడమే తాను చేసుకున్న పాపమా అంటూ కన్నీరుపెట్టుకున్నాడు. కరోనా సోకిందన్న బాధ కంటే చుట్టూ ఉన్న మనుషులు తనతో వ్యవహరించిన తీరు చూస్తేనే చచ్చిపోవాలనిపిస్తోందని బాధపడ్డాడు. చివరకు ఆఫీసర్లు మెట్‌పల్లి పట్టణ శివారులోని బీసీ హాస్టల్‌‌లో ఉంచారు.

అద్దెఇండ్లలో ఉన్నవాళ్లకు పొరపాటున కరోనా వస్తే ఆ కష్టాలు ఘోరంగా ఉంటున్నాయి. పాజిటివ్ వస్తే ఓనర్లుఇంట్లకు రానిస్తలేరు. బయిటి నుంచి బయిటికే వెళ్ళగొడుతున్నరు. కొందరైతే ఉన్నఫలంగా ఖాళీ చేసి పొమ్మంటున్నరు. ప్రాణాలకు తెగించి కరోనా పేషెంట్లకు సేవ చేసే మెడికల్ స్టాఫ్ , వివిధ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లసర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగు లు పైనా కనికరం చూపిస్తలేరు. మహబూబ్‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓ నర్సు కుటుంబానికి అక్కడి ఇంటి ఓనర్ చుక్కలు చూపించిండు. ఎస్సై వచ్చిచెప్పినా వినిపించుకోలేదు. మిర్యాలగూడలోనూ ఓ మెడికల్ సూపర్ వైజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. నారాయణపేటలో ఒక డిప్యూటీ తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ది ఇలాంటి చేదు అనుభవమే. చివరికి సొంత ఊరికి వెళడమో, ్ల లేదంటే అక్కడే బడుల్లో, శ్మశానవాటికల్లోని షెడ్లలోనో తలదాచుకోవాల్సి వస్తోంది. ఇలాంటి వారి కోసం గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్లుఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్నా సర్కారు పట్టిం చుకుంట లేదు.

గవర్నమెంట్క్వారంటైన్లు ఎత్తేసిన సర్కారు

కిరాయి ఇండ్లలో ఉండేవారు, హోం ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫెసిలిటీస్ లేనివారి కోసం గవర్నమెంట్ క్వారంటైన్ సెం టర్లుపెట్టాలని ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్స్ సూచిస్తున్నాసర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టించుకుం టలేదు. మొదట్లో ఫారిన్ హిస్టరీ ఉన్నవాళ్లు, ప్రైమరీ కాంటా క్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కోసం జిల్లాల్లో పెద్ద సంఖ్యలో గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్లుఏర్పాటు చేశారు. ఆఫీసర్లు, పోలీసుల సాయంతో అలాంటివారికి క్వారంటైన్ స్టాంపు వేయించి ఆ సెంటరకు ్ల తరలించారు. వాళ్లకు బలమైన తిండి సహా అన్ని సౌలత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కల్పించారు.వాటిని అట్లనే కొనసాగిస్తే కరోనా ఇప్పటికే చాలా వరకు కంట్రోల్లోకి వచ్చేది. కానీ అనూహ్యంగా ఈ సెంటర్లను ఎత్తేసి, హోం ఐసోలేషన్ అంటూ ఇంటికి పంపిస్తున్నారు. దీంతో కిరాయి ఇండ్లలో ఉంటున్న వారికి కష్టాలు మొదలయ్యాయి.

ఇంట్లకు రానియ్యరని కరోనాను దాస్తున్నరు

కరోనా ఎంత విజృంభించినా హాస్పిటల్ స్టాఫ్ , ఇతర గవర్నమెంట్, ప్రైవేట్ ఎంప్లాయిస్ డ్యూటీలకు పోక తప్పదు. రిస్క్ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేయడం వల్లవీరిలో చాలామందికి సహజంగానే కరోనా సోకుతోంది. ఇలాంటివారంతా తమకు పాజిటివ్ వచ్చిందని తెలిస్తే ఓనర్లతో ఇబ్బం దులు తప్పవని ఆ విషయాన్నిదాచిపెట్టిమామూలుగా ఉంటున్నారు. ఇది మంచిదికాదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కరోనా అని తెలిస్తే ఇరువైపుల వారికీ బెటర్ అని, ఓనర్లుహోం క్వారంటైన్కు స హకరిస్తే వాళ్లకు ఎలాంటి ప్రమాదం ఉండదని సూచిస్తున్నారు.

ప్రభుత్వం పట్టించుకోకున్నాముందుకొస్తున్న ఆఫీసర్లు

అద్దె, చిన్న ఇండ్లలో హోం ఐసోలేషన్ ఉండలేక కష్టాలు పడుతున్నవారి గురించి ప్రభుత్వం పట్టించుకోకున్నా పలువురు ఆఫీసర్లు ముందుకొచ్చి గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఆయా జిల్లాల కలెక్టర్లు చొరవ తీసుకుంటున్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల ఒత్తిడి, డాకర్ట్ల విజ్ఞప్తిమేరకు కామారెడ్డిజిల్లాలో ఆఫీసర్లుమూడు క్వారంటైన్ సెంటర్లను ఓపెన్ చేయించారు. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కేసులు ఎక్కువగా పెరుగుతుండడంతో శాతవాహన, కాకతీయ యూనివర్సిటీల్లోనూ కొత్తగా గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇదే స్ఫూర్తి తో అన్నిజిల్లాల్లో నూ ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది.

రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇట్లాంటి సంఘటనలే..

  • మిర్యాలగూడ పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేసే ఓ 40 ఏండ్లఎప్లాయికి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. విషయం తెలిసిన వెంటనే ఇంటి ఓనర్, అదే బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో కిరాయికి ఉంటున్నవారు ఖాళీ చేయాలని ఆమెపై ఒత్తిడి చేసిన్రు. ఎంత చెప్పినా వినకపోవడంతో ఆమె అప్పటికప్పుడు సొంతూరు వెళ్లిహోం క్వారంటైన్ అయ్యారు.
  • చొప్పదండి మండల పరిషత్ ఆఫీసులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి అక్కడే ఓ అద్దెఇంట్లో ఉంటున్నాడు. వారం కింద జిటివ్ అని తెలిసిన వెంటనే తన స్వగ్రామం వెళ్ళిపోయాడు కానీ ఓనర్ అతని భార్యబిడ్డలు కూడా వెళ్ళిపోవాలని ఒత్తిడి తెచ్చాడు. గత్యంతరం లేక వారు సొంతూరుకు పోయారు.
  • సిద్దిపేటలోని చేపల మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద ఒక వ్యక్తికి కరోనా వచ్చింది. దీంతో ఇంటి ఓనరు ఖాళీ చేయాలని పట్టుబట్టాడు. దీంతో కుటుంబంతో సహా పట్టణ శివారులోని ఓ పాడుబడిన ఇంట్లోకి మారారు. నిర్మానుష్యమైన ప్రాంతం కావడంతో భయపడ్డారు. విషయం తెలిసిన ఆఫీసర్లు ఐసో లేషన్ వార్డుకు తరలించారు.
  • జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లికి చెందిన ఓ సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి పాలకుర్తిలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇతనికి నాలుగు రోజుల క్రితం పాజిటివ్ అని తెలిసి,ఇంటి ఓనర్ ఖాళీ చేయాలన్నడు. చేసేదేమీ లేకమల్లంపల్లి శివారు మామిడి తోటలో రెండు రోజులున్నాడు. బంధువులు భరోసా ఇవ్వడంతో సొంతూరులోని తన సమీప బంధువు ఇంటి ముందు కొట్టంలో ఉంటున్నాడు.
  • కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ కాలనీలో అద్దెకు ఉంటున్న ఓ మహిళకు పాజిటివ్ వచ్చింది. విషయం చెబితే ఖాళీ చేయిస్తారనే భయంతో ఎవరికీచెప్పలేదు. హాస్పిటల్ స్టాఫ్‌కు కూడా తప్పుడు అడ్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఇచ్చారు. ఈ విషయాన్ని ఇటీవల ఆమే స్వయంగా ఒప్పుకుంది.

నర్సు కుటుంబాన్ని ఖాళీ చేయించిన్రు..

‘‘నా భార్య గవర్నమెంట్ హస్పిటల్ లో నర్సు. ఇటీవలే ఆమెకు పాజిటివ్ వచ్చింది. అక్కడే ఐసోలేషన్ చేశారు. నన్ను హోంక్వారంటైన్లో ఉంచారు. విషయం తెలిగానే మా ఓనర్ వచ్చి ఇల్లు ఖాళీచేయాలని ఆర్డరేశాడు. నాకు నెగిటివ్ వచ్చిందనీ, నా భార్య హాస్పిటల్లో ఉందని చెప్పినా వినిపించుకోలే. ఎస్సై వచ్చిఇంటిఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కౌన్సిలింగ్ ఇచ్చారు. చివరకు భయపడి మా ఓనరే ఇల్లు వదిలి బంధువుల ఇంటికి వెళ్లా డు. మా అపార్టమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నోళ్లంతా ఇండ్లకు తాళాలు వేసుకుని సొంతూర్లకు పోయారు. చివరకు క్వారంటైన్ అయిపోయాక మేమే ఇల్లు ఖాళీ చేశాం.’’- రమేశ్,