సీఎంకు సవాల్ చేసిన గవర్నర్

సీఎంకు సవాల్ చేసిన గవర్నర్

బెంగాల్ రాజకీయాలు హీటెక్కాయి. అక్కడ గవర్నర్, సీఎంకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తాజాగా బెంగాల్ సీఎం మమత బెనర్జీ... ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంకర్ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇదే అంశంపై బెంగాల్ గవర్నర్ స్పందించారు. ఈ విషయంపై సీఎం మమతను మీడియా ప్రశ్నించకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఇది ప్రజస్వామ్యానికి సవాల్ అని ఆయన పేర్కొన్నారు. ఆమె చెప్పినదానిపై తనకు విశ్వసనీయత లేదన్నారు. గవర్నర్ తనపై ప్రతిరోజూ ట్వీట్లు చేస్తున్నారని సీఎం తనపై ఆరోపణలు చేశారన్నారు. కానీ తాను ఒక్క ట్వీట్ కూడా పంపలేదని పేర్కొన్నారు గవర్నర్ జగదీప్ ధంకర్. 

తన టేబుల్ మీద ఏ ఫైల్ కూడా పెండింగ్ లేదన్నారు. పెండింగ్ సమస్యలు ఉంటే, సీఎం, ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు.  ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నేను ప్రతిరోజూ తాజ్ బెంగాల్ నుండి ఫుడ్ ఆర్డర్ చేస్తాను అన్న ఆమె ప్రకటన 100% అవాస్తవమన్నారు. తాను దుర్వినియోగం చేసిన ఒక్క ట్వీట్, లేదా ఒక్క పత్రాన్ని నిరూపించాలని... సీఎంకు సవాల్ చేశారు బెంగాల్ గవర్నర్. సీఎం పనితీరు ప్రజాస్వామ్య పాలనకు పెద్ద సవాలుగా మారుతోందన్నారు. బెంగాల్‌లో చట్ట నియమాలకు అనుగుణంగా పాలన లేకుంటే నేను రంగంలోకి దిగుతానని హచ్చరించారు గవర్నర్ జగదీప్ ధన్‌కర్.