కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే.. ప్రగతి భవన్ గేటు ముందే నిరాహారదీక్ష

కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే..  ప్రగతి భవన్ గేటు ముందే నిరాహారదీక్ష

మెదక్: ప్రజల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు  సెప్టెంబర్ 2న సీఎం కేసీఆర్ అపాయిమెంట్ ఇవ్వమని అడుగుతున్నా.. ఆయనను కలసి సమస్యలు వివరిస్తాం… ఒకవేళ అసాయింట్ మెంట్ ఇవ్వకపోతే ప్రగతి భవన్ గేటు ముందు నిరాహార దీక్ష చేస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. మెదక్ లో నిర్వహించిన  ప్రెస్ మీట్ లో ఆయన ఈ  కామెంట్స్ చేశారు.  మ్యానిఫెస్టో తగ్గట్టు ఎన్నికల హామీలు నెరవేర్చడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అయిందని ఆయన ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చింది… రైతులకు ఉచిత విద్యుత్, లక్ష రూపాయల రుణమాఫీ చేశాం.. రాష్ట్ర విభజన విషయంలో సోనియా స్పందించి తెలంగాణ ఇచ్చిందని జగ్గారెడ్డి వివరించారు.

కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 12 శాతం ముస్లింలకు, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారని జగ్గారెడ్డి  విమర్శించారు. ఎంతోమంది ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకున్నారు… అయితే రుణమాఫీ ఇవ్వలేదు.. గిట్టుబాటు ఇవ్వలేదు, పంట నష్టాలు జరిగితే అస్సలు ఇవ్వలేదన్నారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు… అయితే 2018 లో కూడా మాటల గారడితోనే టిఆర్ఎస్ గెలిచిందన్నారు. కాళేశ్వరం ద్వారా మల్లన్నసాగర్ కు నీళ్ళు ఇచ్చి ఉమ్మడి మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని నేటికి నెరవేర్చలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాల పనిచేస్తుంది.. దీనిని ప్రజలు గమనించాలన్నారు. సెప్టెంబర్ 2న సీఎం కేసీఆర్ అపాయిమెంట్  ఇవ్వండి అని అడుగుతున్నా.. కేసీఆర్ ను కలిస్తే సమస్యలు వివరిస్తాం… ఇవ్వకపోతే ప్రగతి భవన్ గేటు ముందు నిరాహార దీక్ష చేస్తానని జగ్గారెడ్డి చెప్పారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కాలన్నా కుదరదు.. మేమెప్పుడూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేదని ఆయన పేర్కొన్నారు.