అరుదైన ఘనతకు సెంచరీ దూరంలో కోహ్లీ

అరుదైన ఘనతకు సెంచరీ దూరంలో కోహ్లీ

పరుగుల యంత్రం..రికార్డుల రారాజు..టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని మరో రికార్డు ఊరిస్తోంది. ఇప్పటికే వన్డే, టెస్టు, టీ20ల్లో అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్న కోహ్లీ..బంగ్లాదేశ్తో మొదలైన టెస్టు సిరీస్లో అరుదైన రికార్డును అందుకునే ఛాన్సుంది. 

మూడేళ్ల పాటు సెంచరీ చేయక ఇంటా బయటా విమర్శలెదుర్కొన్న కోహ్లీ..ఆసియాకప్ లో సెంచరీ కరువు తీర్చుకున్నాడు. అఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 71వ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ ఆడినా..అక్కడ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. అయితే సెంచరీ మాత్రం చేయలేదు.  ఈ సమయంలో న్యూజిలాండ్ పర్యటన నుంచి కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి అనంతరం బంగ్లాతో వన్డే సిరీస్, టెస్టు సిరీస్లో బరిలోకి దిగాడు. బంగ్లాతో జరిగిన చివరి వన్డేలో సెంచరీ చేశాడు. ఫలితంగా 72వ సెంచరీని నమోదు చేశాడు. 

తాజాగా టెస్టు సిరీస్లో భాగంగా బుధవారం నుంచి తొలి టెస్టు మొదలైంది. ఈ నేఫథ్యంలో కోహ్లీని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ రెండు టెస్టుల్లో కనీసం ఒక్క సెంచరీ చేసినా..కోహ్లీ అరుదైన ఘనత సాధిస్తాడు.  ఒకే ఏడాదిలో టీ20, వన్డే, టెస్టుల్లో సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మన్గా రికార్డులకెక్కుతాడు. అయితే తొలి ఇన్నింగ్స్లో కోహ్లీ కేవలం ఒకే పరుగు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్లో  కోహ్లీ సెంచరీ చేసే ఛాన్సుంది.  మరి బంగ్లాదే పై కోహ్లీ ఈ చరిత్రను తిరగరాస్తాడేమో చూడాలి.