ఒక్క పిల్లర్ కుంగితే కాళేశ్వరం మొత్తానికే పనికి రానట్టా?

ఒక్క పిల్లర్ కుంగితే కాళేశ్వరం మొత్తానికే పనికి రానట్టా?

మహదేవపూర్, వెలుగు: ఒక్క మేడిగడ్డ పిల్లర్ కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం పనికి రానిదన్నట్టు కాంగ్రెస్ నేతలు చెప్పడం హాస్యాస్పదమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కాంగ్రెస్​ప్రభుత్వం బీఆర్ఎస్​ హయాంలో చేసిన మంచి పనులను వక్రీకరించి, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తోందని, తమ పార్టీలో చేరిన వారికే ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తామనడం అమానుషమన్నారు. ఇసుక మాఫియా పేరుతో తమని బద్నాం చేస్తున్నారని, ఇసుక మాఫియా చేసింది ఎవరో ప్రజలే చెప్పాలన్నారు. టైంకు పెన్షన్, నీళ్లు, కరెంటు ఇవ్వలేని ప్రభుత్వం తెలంగాణలో ఉందన్నారు.