
హైదరాబాద్, వెలుగు: సర్పంచ్ సీట్లలో భర్తలు / భార్యలు కూర్చోవటం, మీటింగ్‌లు పెడుతున్న సంఘటనలు నిత్యం వెలుగు చూస్తుండటంతో పంచాయతీ రాజ్ శాఖ కఠిన చర్యలకు రెడీ అయ్యింది. ఇక నుంచి సర్పంచ్ ప్లేస్ లో వాళ్ల బంధువులు, భర్తలు, భార్యలు కూర్చున్నా, మీటింగ్‌లు నిర్వహించినా పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ రఘునందన్ రావు హెచ్చరించారు. ఇటీవల దీనిపై మెమో జారీ చేయటంతో పాటు, చర్యలు తీసుకోవాలని జిల్లా కలెకర్లను కమిషనర్ ఆదేశించారు. రూల్స్ ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తా మని కమిషనర్ స్పష్టం చేశారు.