- ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి మంచి చేస్తుంటే.. కేటీఆర్, హరీశ్‌లకు నొప్పి ఎందుకని ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఫైరయ్యారు. మంగళవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిరోజూ రేవంత్ నామ జపం చేయడం తప్ప కేటీఆర్, హరీశ్‌లకు రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ ప్రజల సంక్షేమం ఏమాత్రం పట్టదని విమర్శించారు.
రేవంత్‌రెడ్డి ప్రజలకు ఉపయోగపడే ఏ మంచి పనిచేసినా బావా, బామ్మర్ధి తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. రెండున్నరేళ్లలో రేవంత్‌రెడ్డి పేద, మధ్య తరగతి ప్రజలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, దీంతో ప్రజలు ఆయన వైపే నిలుస్తున్నారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలుపు ఖాయమని మెట్టు సాయి స్పష్టం చేశారు.
