భార్యతోనూ బలవంతపు సెక్స్ అత్యాచారమే

భార్యతోనూ బలవంతపు సెక్స్ అత్యాచారమే

భార్య సమ్మతి లేకుండా భర్త ఆమెతో బలవంతంగా కలిస్తే..అది కూడా అత్యాచారం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అది  బలవంతపు గర్భధారణ కిందకు వస్తుందని తెలిపింది.  ఇలాంటి గర్భధారణల నుంచి మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.  MTP చట్టంలో అత్యాచారానికి అర్థంలో వైవాహిక అత్యాచారాన్ని కూడా చేర్చాల్సిన అవసరముందని తెలిపింది.

భార్య కు బలవంతపు సెక్స్ ద్వారా కలిగే గర్భాన్ని తీయించుకునే హక్కు ఉంది. ఎవరైనా 24 వారాలలోపు అబార్షన్ చేయించుకోవచ్చు. మహిళ తనకు నచ్చినది ఎంచుకునే హక్కు ఉంది.  కేవలం వివాహం చేసుకున్న మహిళలే శృంగారం చేయాలనే నిబంధన ఏమీ లేదు...అని సుప్రీం కోర్టు వెల్లడించింది.