బంగారం, వెండి కొనేదెట్లా..? రూపాయి పతనంతో మరింత ఫిరం అవుతున్న పసిడి !

 బంగారం, వెండి కొనేదెట్లా..? రూపాయి పతనంతో మరింత ఫిరం అవుతున్న పసిడి !

 బంగారం, వెండి ధరలు శుక్రవారం కొత్త రికార్డు స్థాయికి చేరాయి. అమెరికా డాలర్ బలహీనత, ఫెడ్ వడ్డీ తగ్గింపు అంచనాలు అంతర్జాతీయ మార్కెట్లలో ధరలను పెంచా యి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం (జనవరి 23) రూ.2,840 పెరిగి రూ.1,57,150 కి చేరింది. 

కేజీ వెండి ధర రూ.20 వేలు ఎగిసి రూ.3,60,000 ను తాకింది. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.15 వేలు పెరిగి రూ.3.40 లక్షలకు చేరగా, గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర రూ.2,840 పెరిగి రూ.1,57,300 కి చేరింది.

డాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రూపాయి శుక్రవారం రికార్డు కనిష్టమైన 92 స్థాయికి పడిపోయింది.  చివరికి 91.88 లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముగించింది.  విదేశీ పెట్టుబడులు మార్కెట్ నుంచి వెళ్లిపోతుండడం,   క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, అమెరికా ట్రెజరీ యీల్డ్స్ పెరగడం రూపాయిపై ఒత్తిడి తెచ్చాయి. 

ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాంక్ ఫారెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూపాయి శుక్రవారం డాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మారకంలో   91.45 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 92.00 వద్ద జీవిత కాల కనిష్టాన్ని నమోదు చేసింది. ఈ నెలలో రూపాయి 200 పైసలు (2శాతం) పతనమైంది. మరోవైపు  బ్రెంట్ క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1.03శాతం పెరిగి బ్యారెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  64.72 వద్ద ట్రేడవుతోంది.