
- ఆల్బినెన్ గ్రామానికి వలసలను ప్రోత్సహించే పథకం
- గ్రామాన్ని జనంతో కళకళలాడేలా చేసే యత్నం
ఆల్బినెన్: పెద్ద ఎత్తున ట్యాక్స్‌లు వసూలు చేసే నగరాలను చూశాం.. కఠిన నిబంధనలు అమలు చేసే పట్నాలను చూశాం.. కానీ ఒక చిన్న గ్రామం మాత్రం మాతోనే ఉండిపోండి మీకు ఎదురు డబ్బులు ఇస్తామని చెబుతోంది. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయితే 50 వేల పౌండ్లు( రూ. అర కోటి పైనే ) ఆఫర్ చేస్తోంది. ఈ గ్రామం ఎక్కడుందంటే..
ఆహ్లాదకర వాతావరణానికి కేరాఫ్..
చుట్టూ మంచుకొండలు.. స్వచ్ఛమైన గాలి.. కలుషితం కాని నీరు.. సముద్ర మట్టానికి 4,265 ఫీట్ల ఎత్తులో ఉన్న ఆల్బినెన్ పట్టణమది. ఎంతో బ్యూటిఫుల్‌గా ఉండే ఈ స్విట్జర్లాండ్ గ్రామ జనాభా క్రమంగా తగ్గిపోతోంది. మెరుగైన జీవితం కోసం చాలా కుటుంబాలు వలస వెళ్లిపోయాయి. దీంతో ఆల్బినెన్ గ్రామ జనాభా 243కు తగ్గింది. ఇలాగే వదిలేస్తే గ్రామం గల్లంతవడం ఖాయం. దీంతో ఆల్బినెన్కు వచ్చి స్థిరపడే కుటుంబానికి రూ.అర కోటి పైనే ఇస్తామని స్విట్జర్లాండ్ ప్రభుత్వం ప్రకటించింది.