- సడలింపుల నేపథ్యంలో కేజ్రీవాల్ సూచన
న్యూఢిల్లీ: ప్రజలంతా సోషల్ డిస్టెంసింగ్ పాటిస్తూ, మాస్కులు వేసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని అప్పుడే ఈ కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోగలమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశరాజధాని ఢిల్లీలో కొన్ని సడలింపులు ఇచ్చిన కారణంగా ఈ సూచనలు చేశారు. “ ఈ రోజు నుంచి కొన్ని ఎకనామిక్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. క్రమశిక్షణగా ఉండటం మన బాధ్యత. మాస్కులు, శానటైజర్లు వాడాలి. సోషల్ డిస్టెంసింగ్ పాటించడం చాలా ముఖ్యం. అందరూ బాగుండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. క్రమశిక్షణతో మెలిగితే దేవుడు కూడా మనల్ని కాపాడతాడు” అని కేజ్రీవాల్ హిందీలో ట్వీట్ చేశారు. లాక్‌డౌన్ 4.0 కింద ఢిల్లీ గవర్నమెంట్ మెట్రో మినహా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కు అనుమతిచ్చింది. మార్కెట్లు, షాపులు ఓపెన్ చేసుకొవచ్చని చెప్పింది.
