సరైన ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ లేకపోతే బరువు పెరిగి షేపవుటవుతారు

సరైన ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ లేకపోతే బరువు పెరిగి షేపవుటవుతారు

శరీరం ఫిట్‌‌‌‌‌‌‌‌గా ఉందా, ఆరోగ్యంగా ఉన్నారా అనేది ముఖం, జుట్టు చూస్తే తెలుస్తుంది. సరైన ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ లేకపోతే బరువు పెరిగి షేపవుట్ అవుతారు. అలా జరగకుండా ఉండాలంటే రోజూ యోగా చేయాలి అంటున్నారు ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌. దానివల్ల ఆరోగ్యంగానే కాకుండా అందంగా కూడా ఉండొచ్చు. 

వశిష్టాసనం 

ఈ ఆసనాన్ని సైడ్‌‌‌‌‌‌‌‌ ప్లాంక్ అంటారు.  వశిష్టాసనం చేయడానికి సెట్‌‌‌‌‌‌‌‌కి సెట్‌‌‌‌‌‌‌‌కి మధ్యలో 30 సెకండ్ల టైం కేటాయించాలి. ఈ ఆసనాన్ని ఎలా చేయాలంటే.. ముందు ప్లాంక్ పొజిషన్‌‌‌‌‌‌‌‌లోకి రావాలి. కుడి పక్కకు తిరిగి కుడి చేతితో శరీరాన్ని పైకి లేపి, ఎడమ చేతిని నిటారుగా పైకి ఎత్తాలి. అలానే ఎడమ పక్క కూడా చేయాలి.

పాదహస్తాసనం

దీన్నే ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌లో హాండ్‌‌‌‌‌‌‌‌ టు ఫుట్‌‌‌‌‌‌‌‌ పోజ్‌‌‌‌‌‌‌‌ అంటారు. కాళ్లు దగ్గరగా పెట్టుకొని నిటారుగా నిల్చోవాలి. చేతులు పైకి ఎత్తి నెమ్మదిగా కిందికి వంగాలి. నుదిటిని మోకాళ్లకు ఆన్చుతూ, అర చేతులతో నేలను తాకాలి. తరువాత చేతులతో పాదాలను పట్టుకొని నెమ్మదిగా గాలి పీల్చుతూ, వదులుతూ ఈ ఆసనాన్ని వేయాలి.

సిద్ధ వాక్‌‌‌‌‌‌‌‌ లేదా ఇన్ఫినిటీ వాక్‌‌‌‌‌‌‌‌

ఇది సాంప్రదాయమైన యోగా నడక. దీన్ని ఎనిమిది అంకెలా నడుస్తారు కాబట్టి ఇన్ఫినిటీ వాక్‌‌‌‌‌‌‌‌, సిద్ధ వాక్ అంటారు. నేలపై రెండున్నర మీటర్ల పొడవుండే ఎనిమిది అంకెను గీయాలి. శరీరాన్ని రిలాక్స్‌‌‌‌‌‌‌‌ చేసి ఆ అంకె ఉన్న గీతపై పది నిమిషాలపాటు నడవాలి. సిద్ధ వాక్‌‌‌‌‌‌‌‌ చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. శరీరం మీద బ్యాలెన్సింగ్‌‌‌‌‌‌‌‌ వస్తుంది.

పశ్చిమోత్తాసనం 

నేలపై కూర్చొని శరీరాన్ని రిలాక్స్‌‌‌‌‌‌‌‌ చేయాలి. కాళ్లు ముందుకు చాచి నిటారుగా కూర్చోవాలి. తరువాత నెమ్మదిగా ముందుకు వంగి నుదిటితో మోకాళ్లను తాకాలి. చేతులతో పాదాలను పట్టుకొని ఈ ఆసనాన్ని చేయాలి.

దీన్నే షోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాండ్‌‌‌‌‌‌‌‌ పోజ్ అంటారు. 

నేలపై వెల్లకిలా పడుకొని చేతులతో నడుము పట్టుకోవాలి. తరువాత కాళ్లు, నడుము, వీపు భాగాల్ని పైకి ఎత్తి నిటారుగా ఉంచి భుజాలపై శరీరాన్ని బ్యాలెన్స్ చేయాలి. నెమ్మదిగా నడుమును వదిలి, చేతుల్ని నేలపై పెట్టి ఈ ఆసనాన్ని వేయాలి.