వాట్సాప్ లేకుంటే ఆరట్టై వాడండి: వాట్సాప్ అకౌంట్ బ్లాక్ కేసులో సుప్రీంకోర్టు సూచన

వాట్సాప్ లేకుంటే ఆరట్టై వాడండి: వాట్సాప్ అకౌంట్ బ్లాక్ కేసులో సుప్రీంకోర్టు సూచన

న్యూఢిల్లీ: వాట్సాప్ అకౌంట్ బ్లాక్ చేశారని, పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్​ను శనివారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ పిటిషన్​ను ఆర్టికల్ 32 కింద ఎందుకు వేశారని ప్రశ్నించింది. 

వాట్సాప్ యాక్సెస్ ప్రాథమిక హక్కు ఎలా అవుతుందని అడిగింది. దీనికి పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ డయాగ్నోస్టిక్ సెంటర్​లో పనిచేస్తున్నారని 10 నుంచి 12 ఏండ్లుగా వాట్సాప్​లోనే తన క్లయింట్లతో టచ్​లో ఉన్నారని తెలిపారు. 

ఆకస్మాత్తుగా తన అకౌంట్ ను బ్లాక్ చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై బెంచ్​ స్పందిస్తూ.. ‘‘కమ్యూనికేషన్ కోసం ఇతర యాప్​లను ఉపయోగించొచ్చు కదా! ఈ మధ్యే స్వదేశీ యాప్ ఆరట్టై కూడా వచ్చింది. దాన్ని వాడుకోండి’’ అని సూచించింది.