లైసెన్స్‌‌‌‌‌‌‌‌ లేని వాళ్లకు బండిస్తే రూ. 5 వేలు ఫైన్

లైసెన్స్‌‌‌‌‌‌‌‌ లేని వాళ్లకు బండిస్తే రూ. 5 వేలు ఫైన్
  • వెహికల్ ఇస్తున్నరా..జాగ్రత్త!
  • డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రెస్పాండెంట్ గా ఓనర్స్
  • గ్రేటర్ లోని 3 కమిషనరేట్లలో పోలీసుల యాక్షన్ ప్లాన్
  • ఎంవీ యాక్ట్–19 ప్రకారం రూ.5 వేలు ఫైన్ విధిస్తున్న కోర్టులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌,వెలుగు: మీ బైక్, కారు ఎవరికైనా ఇస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే మీ వెహికల్ తీసుకెళ్లిన వాళ్లు డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడితే మీపై  కూడా పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. ఎంవీ యాక్ట్–19 కింద కేసులు రిజిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందుకోసం గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని 3 కమిషనరేట్ల పోలీసులు యాక్షన్‌‌‌‌‌‌‌‌ ప్లాన్ రూపొందించారు. స్పెషల్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌‌‌‌‌‌‌‌లో ట్రాఫిక్ రూల్స్‌‌‌‌‌‌‌‌ పాటించని వారి  లైసెన్స్‌‌‌‌‌‌‌‌లను సస్పెండ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు.  డ్రంకన్ డ్రైవర్స్‌‌‌‌‌‌‌‌కి లైసెన్స్‌‌‌‌‌‌‌‌ లేకపోతే వెహికల్‌‌‌‌‌‌‌‌ ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రెస్పాండెట్ గా పోలీసులు చార్జిషీట్‌‌‌‌‌‌‌‌ ఫైల్ చేస్తున్నారు. డ్రంకన్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌‌‌‌‌‌‌‌లో చిక్కిన వారిని ఫస్ట్‌‌‌‌‌‌‌‌ రెస్పాండెంట్‌‌‌‌‌‌‌‌గా, ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సెకండ్‌‌‌‌‌‌‌‌ రెస్పాండెంట్‌‌‌‌‌‌‌‌గా పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఫస్ట్‌‌‌‌‌‌‌‌ రెస్పాండెంట్‌‌‌‌‌‌‌‌కి కోర్టులు రూ.10 వేలు ఫైన్, ఒకరోజు జైలు శిక్ష విధిస్తున్నాయి. ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి రూ.5 వేలు ఫైన్​ వేస్తున్నాయి.   డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌ లెసెన్స్‌‌‌‌‌‌‌‌ లేకుండా డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో చిక్కిన వారికి కోర్టులు రూ.15 వేల ఫైన్, ఒకరోజు జైలు శిక్ష విధిస్తున్నాయి.

బీఏసీ లెవల్స్ ఆధారంగా..

డ్రంకన్ డ్రైవ్ చెకింగ్ లో పట్టుబడ్డ వారికి  30 శాతం కంటే ఎక్కువ బ్లడ్‌‌‌‌‌‌‌‌ అల్కహాల్‌‌‌‌‌‌‌‌ కంటెంట్‌‌‌‌‌‌‌‌(బీఏసీ) లెవల్స్ ఉంటే వెహికల్ సీజ్ చేస్తున్నారు. బీఏసీ లెవల్స్ 100 శాతం దాటి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే  రూ.15 వేలు ఫైన్‌‌‌‌‌‌‌‌, 4 రోజుల వరకు జైలు శిక్షలు విధిస్తున్నారు. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం, డ్రంకన్ డ్రైవ్ వల్ల యాక్సిడెంట్స్‌‌‌‌‌‌‌‌ జరిగే అవకాశాలు ఉండడంతో చెకింగ్ లో పట్టుబడ్డ వెహికల్స్ లో ఓనర్స్‌‌‌‌‌‌‌‌ను కూడా పోలీసులు రెస్పాండెంట్స్‌‌‌‌‌‌‌‌గా చేర్చుతున్నారు. ఇలా లైసెన్స్ లేని వారికి బైక్ లు, కార్లు ఇస్తున్న పేరెంట్స్‌‌‌‌‌‌‌‌, ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌,క్యాబ్‌‌‌‌‌‌‌‌ ఓనర్స్‌‌‌‌‌‌‌‌పై కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ కొందరు వాహనదారులు తమది కాని వెహికల్ ను చెకింగ్ స్పాట్ లోనే వదిలేసి ఎస్కేప్ అవుతున్నారు.  ఇందుకోసం వారు  ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌, రెంటెడ్ వెహికల్స్ ను ఎక్కువగా వాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

ఫ్రెండ్ కి బైక్ ఇచ్చి ఫైన్ కట్టిన

లాస్ట్‌ మండే నా ఫ్రెండ్‌ బయటికి వెళ్తానంటే బైక్‌ ఇచ్చా. అతనికి డ్రైవింగ్‌ లైసెన్స్‌‌‌‌‌‌‌‌ లేని సంగతి నాకు తెలియదు. ఆ రోజు పార్టీకి వెళ్లాడట. డ్రంకన్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌ లో గచ్చిబౌలి పోలీసులకు దొరికాడు. పోలీసులు నాకు ఫోన్‌‌‌‌‌‌‌‌ చేసి స్టేషన్‌‌‌‌‌‌‌‌కి పిలిపించారు. మా ఫ్రెండ్‌ తో పాటు నాపైన కూడా కేస్‌‌‌‌‌‌‌‌ రిజిస్టర్ చేశారు. శనివారం
కోర్టు పనిష్మెంట్‌ ఇచ్చింది. మా ఫ్రెండ్‌ కి రూ. 15వేలు, ఒక రోజు జైలు శిక్ష, లైసెన్స్‌‌‌‌‌‌‌‌ లేని వ్యక్తికి వెహికల్‌ ఇచ్చినందుకు నాకు రూ.5 వేలు ఫైన్‌‌‌‌‌‌‌‌ విధించింది.

– అశోక్ కుమార్, సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్, మాదాపూర్

For More News..

కూరగాయల ధరలు తగ్గినయ్

ఎలక్ట్రిక్‌‌ బైకులకు నో ట్యాక్స్‌‌, నో రిజిస్ట్రేషన్‌‌ ఫీజు

33 వేల మందికి ఒక్కడే డాక్టర్​.. ఇదీ మన ఆరోగ్యరంగం

పోతిరెడ్డిపాడు పక్కనే రాయలసీమ లిఫ్ట్‌