
మహబూబ్ నగర్ టౌన్,వెలుగు: అమెజాన్‌లో కలశం ఆర్డర్ చేస్తే చిత్తుకాగితాలు వచ్చాయి. మహబూబ్ నగర్ టౌన్ లోని రాజేంద్రనగర్ లోని మానసరత్నం అపార్టుమెంట్ లో నివాసం ఉంటున్న మాధురి గత నెల 21న రూ.17 వేల విలువైన వెండి కలశాన్ని ఆమెజాన్‌లో ఆర్డర్ చేసింది. 24న డోర్ డెలివరీ కాగా.. ఓపెన్ చేసి చూస్తే అందులో చిత్తుకాగితాలు కనిపించడంతో షాక్ అయ్యింది. దీంతో కంపెనీకి ఫిర్యాదు చేయగా ఇన్వెస్టిగేషన్ టీం వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్పారు. అయినా ఇప్పటి వరకు ఎవరూ రాలేదని ఆమె వాపోయారు.