వానాకాలంలోనూ హుషారుగా ఉండాలంటే.. ఇలా తినండి

వానాకాలంలోనూ హుషారుగా ఉండాలంటే.. ఇలా తినండి

వానాకాలం అంటే మంకుగా ఉంటుంది.. ఆకలి కాదు.. తిన్నది తొందరగా అరగదు.. ఏదో డల్ నెస్ ఉంటుంది ఒంట్లో.. దీనికి కారణం ఒక్కసారిగా హీట్ నుంచి కూల్ లోకి రావటమే.. దీనికితోడు వర్షాల జలుబు, దగ్గు, జ్వరంతోపాటు కలుషితం అయ్యే నీటి వల్ల తరచూ విరేచనాలు, వాంతులు అనేవి వస్తూ ఉంటాయి. ఇది ప్రతి రెయినీ సీజన్ లో కామన్. అలా అని తినకుండా ఉండలేం.. అలాంటప్పుడు ఏం తినాలి.. ఎలా తినాలి.. అనేది తెలుసుకుంటే వానాకాలంలోనూ.. ఉత్సాహంగా.. ఉల్లాసంగా.. హుషారుగా ఉంటారు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

  • రోజుకు ఎనిమిది గ్లాసుల మంచినీళ్లు తాగండి. అది కూడా గోరు వెచ్చని వాటర్ తాగటం మంచిది. దప్పిక అవ్వటం లేదని నీళ్లు తాగకుండా ఉండొద్దు.
  • ఛాయ్ రెగ్యులర్ గా తాగే అలవాటు ఉంటే.. అల్లం టీ తాగటం మంచిది. అదే విధంగా హెర్బల్ టీ తాగటం వల్ల బెటర్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. వీటితోపాటు వేడి వేడి సూప్స్ తాగండి. మీలో శక్తిని ఇస్తుంది. బద్దకాన్ని తొలగిస్తుంది. ఉత్సాహాన్ని ఇస్తుంది.
  • ఫ్రూట్స్ విషయానికి వస్తే దానిమ్మ చాలా మంచిది అంటున్నారు వైద్యులు. వీటితోపాటు యాపిల్స్, బెర్రీ పండ్లు తినండి. వీటిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడ్స్ దండిగా ఉంటాయి.
  • ఈ వర్షాకాలంలో విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. సిట్రస్ పండ్లయిన కివీస్, బెల్ పెప్పర్స్, బ్రోకలీ వంటివి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
  • వాతావరణానికి తగ్గట్టుగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. రోజూవారి ఆహారంలో వెల్లుల్లి, ఉల్లిపాయలను చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయి. వీటిలో సహజంగానే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఇన్ఫెక్షన్లు, ఇతర అంటు వ్యాధులు త్వరగా వ్యాపించకుండా అడ్డుకుంటాయి.
  • పెరుగు వానాకాలంలో తీసుకోవటం మంచిది. అందులో ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి.. మలబద్దకం వంటి సమస్యల నివారణకు తోడ్పడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు పెరుగు ఎంతో సహాయపడుతుంది. చలికాలం కదా అని పెరుగును చాలా మంది తినటం మానేస్తారు.. అలా కాకుండా పెరుగు అన్నం తినటం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.
  • ఈ వర్షాకాలంలో అన్నింటికంటే ముఖ్యమైనది బయటి ఫుడ్ కు దూరంగా ఉండడం. అందులోనూ స్ట్రీట్ ఫుడ్స్ చాలా ప్రమాదకరం. వీటి ద్వారా అనేక వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. వర్షాకాలం బాక్టీరియా, శిలీంధ్రాల పెరుగుదలకు అనువైన కాలం. కాబట్టి రోడ్డు పక్కన అమ్మే తినుబండారాలు కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. జీర్ణ సమస్యలను, వ్యాధులను నివారించడానికి ఇంట్లో వండిన భోజనమే సరైన మార్గమని గుర్తుంచుకోండి.

ఆహార నిల్వలో జాగ్రత్తలు..

వానాకాలంలో సాధారణంగా తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఆహార పదార్ఖాలు సరిగా నిల్వ చేయకపోతే త్వరగా పాడవుతాయి. ఆహారం తాజాగా ఉండడానికి, హానికరమైన బాక్టీరియా పెరుగుదలను నివారించడానికి గాలి చొరబడని కంటైనర్లను ఉపయోగించాలి. ఆహార నాణ్యతను నిర్వహించడానికి, వ్యాపించే వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సరైన ఆహార నిల్వ పద్ధతులు పాటించడం చాలా అవసరం.